Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ ఆశయాలను సాధిద్దాం

- అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన, ప్రజాప్రతినిధులు

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 6 : అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటు పడాలని కలెక్టర్‌ హరిచందన కోరారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమ వారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశానికి అంబేడ్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. అదే విధంగా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టరేట్‌, జడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా దామరగిద్ద మండల కేంద్రంతో పాటు క్యాతన్‌పల్లి, ముస్తాపేట్‌, కందేన్‌పల్లి, కాన్‌కుర్తి గ్రామాల్లోని అంబేడ్కర్‌ యువజన సంఘాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయా ల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. 

నారాయణపేట : దేశ అభివృద్ధికి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగమే స్ఫూర్తి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకుముందు ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి  నివాళి అర్పించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో ప్రిన్సిపాల్‌ నరేష్‌కుమార్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు ప్రభాకర్‌, సత్యయాదవ్‌, వెంకట్రాములు, రఘురామయ్య, రఘు, ఆశప్ప, మొగులప్ప, ముకుందప్ప, సత్యనారా యణ, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

మాగనూరు : మండల కేంద్రంలో అంబేడ్కర్‌ వర్ధంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు.  కార్యక్రమంలో సర్పంచు రాజు, జడ్పీటీసీ వెంకటయ్య, రైతు సమితి మండ లాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచు అశోక్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండలాధ్యక్షుడు మారెప్ప, మార్కెట్‌ కమి టీ డైరెక్టర్‌  శ్రీనివాసులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ సుదర్శన్‌రెడ్డి,  రామ్‌గోపాల్‌, మాగనూరు ఎంపీపీ శ్యామలమ్మ, మండల ప్రధాన కార్యదర్శి అశోక్‌ గౌడ్‌, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకుడు, సింగిల్‌విండో డైరెక్టర్‌ లక్ష్మణ్‌, వెంకటయ్య,  శ్రీనివాసులు పాల్గొన్నారు.

దన్వాడ : మండలంలోని కిష్టాపూర్‌ లో సోమవారం టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యం లో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్టెం దామోదర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, విండో వైస్‌ చైర్మన్‌ బాల్‌రాజ్‌, చెన్నప్ప, వెంకటయ్య, రాజు, ఆర్‌ వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తిరు పతయ్య, యాదయ్య పాల్గొన్నారు.

మరికల్‌ : అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ సురేఖరెడ్డి, ఎమ్మార్పీఎస్‌, బహుజన పార్టీ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్‌ నా యకుడు రామస్వామి, బహుజన నాయకు డు  శ్రీనివాసులు పాల్గొన్నారు.

కృష్ణ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సురేష్‌ అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదే విధంగా మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీల్లో ఆయా శాఖల అధికారులు  నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంఈవో లక్ష్మినా రాయణ, ఎంపీవో విజయలక్ష్మి, ప్రధానోపాఽఽ ద్యాయుడు నిజాముద్దీన్‌, శిరీష, ఆర్‌ఐ వెంకట్రాములు, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి మోనేష్‌, సర్పంచు శివప్ప, రేణు క, మైబు, సావిత్రి, లక్ష్మినారాయణగౌడ్‌, ఎంపీటీసీలు శారద, రామచంద్ర, వీఆర్వోలు రామారావు, సిద్రింరెడ్డి, కోఆప్షన్‌ సభ్యు డు అబ్దుల్‌ ఖాదర్‌ పాల్గొన్నారు.

మక్తల్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో అంబేడ్కర్‌  చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ చిత్రపటానికి అంబేడ్కర్‌ సంఘం, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు జుట్ల నర్సిములు, ప్రజా సంఘాల నాయకులు కిరణ్‌, భాస్కర్‌, బీఎస్పీ అధ్యక్షుడు వాకిటి అంజనే యులు, అర్జున్‌రాజ్‌, నరేందర్‌, కిరణ్‌కుమా ర్‌, భగవంతు, కొండన్న పాల్గొన్నారు. 

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని పంచదేవపహాడ్‌, మంథన్‌గౌడ్‌, అనుగొండ, సొమేశ్వరబండ  గ్రామాల్లో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వనజ అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌, ఎంపీవో పావని, సర్పంచు కల్పన, కృష్ణ, ఎంపీటీసీ ఆశిరెడ్డి, రాములు, వాసుదే వ్‌రావు, సీతారామారావు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ :  రాజ్యాంగ నిర్మాత డాక్ట ర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఊట్కూర్‌లో జడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చిన్న పొర్లలో దళిత శక్తి ప్రోగాం సంస్థ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు షకీల్‌, డీఎస్పీ మండల ఉపాధ్యక్షుడు గోపాల కృష్ణ, గ్రామ అధ్యక్షుడు వేణు నివాళి అర్పించారు. ఆయా కార్య క్రమాల్లో మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సమీ తరుణ్‌రెడ్డి, జమీర్‌అలీ, చిన్నపొర్ల దళిత శక్తి గ్రామ అధ్యక్షుడు వేణు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇర్షాద్‌, మైనార్టీ నాయకులు చాంద్‌పాషా, బందేనవాజ్‌, డీఎస్పీ నాయకులు బాలరాజ్‌, తిమ్మప్ప, నరసింహ, సూరి, దండురాజు, తాండూర్‌ శేఖర్‌, శంకర్‌, రఘు, వెంకటప్ప, కతలప్ప పాల్గొన్నారు.

కోస్గి : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. కోస్గి పట్టణంలో అంబేడ్కర్‌  విగ్రహానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ము నిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మ్యాకల శిరీష పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో ఎంపీపీ మధుకర్‌రావు, జడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి,  రాజేశ్‌, వేణుగోపాల్‌, ఓం ప్రకాశ్‌, ఆనంద్‌రెడ్డి, వీరారెడ్డి, వెంకట్‌ నర్సిములు, హన్మంతురెడ్డి, బాలరాజు, బ్యాగరి రాములు, హరికుమార్‌ పాల్గొన్నారు. 

నర్వ : మండల కేంద్రంలో సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంధ్య, వైస్‌ ఎంపీపీ వీణావతి, అంబేడ్కర్‌ సంఘం మండలాధ్యక్షుడు  అయ్యప్ప, వెంకటయ్య, శరణప్ప, కురుమూర్తి, నర్సింహ్మ, కాంగ్రెస్‌ నాయకుడు టీవీఎస్‌ చెన్నయ్య, ఎందెకోడ్‌ ఎంపీటీసీ నీరజ్‌, అయ్యన్న, ఆంజనేయులు పాల్గొన్నారు.  

మద్దూర్‌ : మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకులు సోమవారం అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసిన ఘనంగా నివాళి అర్పించారు. మద్దూర్‌, నాగిరెడ్డిపల్లి, నందిపాడ్‌, పలెర్ల, భూనీడ్‌ గ్రామాల్లో నివాళి అర్పించి అంబేడ్కర్‌ సేవ లను కొనియాడారు.


అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి


పేటలో అంబేడ్కర్‌ విగ్రహాం వద్ద నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులుAdvertisement
Advertisement