బాల కార్మికులు లేని సమాజం నిర్మిద్దాం

ABN , First Publish Date - 2022-07-27T05:41:57+05:30 IST

బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దామని ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌, ఐఎల్‌వో రంజిత్‌ ప్రకాష్‌ అన్నారు.

బాల కార్మికులు లేని సమాజం నిర్మిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- 48 మంది బాలలకు విముక్తి 

- ఎస్సీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల, జూలై 26 : బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దామని ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌, ఐఎల్‌వో రంజిత్‌ ప్రకాష్‌ అన్నారు. సీడబ్ల్యూసీ, లేబర్‌, బాలరక్ష, డీఆర్‌డీవో, డీసీపీవో శాఖల సమన్వయంతో మంగళవారం గద్వాల పట్టణంలోని హరితహోటల్‌లో వర్క్‌షాప్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బావిభారత పౌరులైన చిన్నారులతో వెట్టి చాకిరీ చేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారులను గొర్రెల కాపరులుగా, గృహ నిర్మాణ కార్మికులుగా, సీడ్‌పత్తి పొలాల్లో కూలీలుగా, కిరా ణం, మెకానిక్‌ దుకాణాల్లో పనులకు నియమిం చుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ బృందంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయిస్తున్నా మన్నారు. ఇప్పటి వరకు 48 మంది బాలకార్మికు లను గుర్తించి, విముక్తి కల్పించామని తెలిపారు. బాధ్యులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని చెప్పారు. మైనర్లను లైంగిక వేధింపులకు గురిచేస్తే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. బాల్యవివాహాలతో కలిగే నష్టాలను వారికి వివరించాలని సూచిం చారు. ఇందుకోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్మికశాఖ అధికారి మహేష్‌కుమార్‌, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-27T05:41:57+05:30 IST