రూ.8 కోట్లతో మోత్కూరును అభివృద్ధి చేద్దాం

ABN , First Publish Date - 2021-07-29T07:08:55+05:30 IST

మోత్కూరు మునిసిపాలిటీని రూ.8కోట్లతో అభి వృద్ధి చేద్దామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మోత్కూరు మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రూ.8 కోట్లతో మోత్కూరును అభివృద్ధి చేద్దాం
మోత్కూరులో జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

మోత్కూరు, జూలై 28: మోత్కూరు మునిసిపాలిటీని రూ.8కోట్లతో అభి వృద్ధి చేద్దామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు.  మోత్కూరు  మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.7.5కోట్లు విడుదల అయ్యాయని, సీఎం కేసీఆర్‌ ఇటీవల వాసాలమర్రి వేదికగా మంజూరు చేసిన ప్రత్యేక నిధులు రూ.50లక్షలతో కలిపి మొత్తం రూ.8కోట్ల తో మోత్కూరు మునిసిపాలిటీని అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రతి వార్డులో రూ.20 నుంచి రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వ లు నిర్మించాలని, మునిసిపాలిటీలో రూ.85 లక్షలతో వైకుంఠధామం అభి వృద్ధి చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిస్తే ఎస్‌బీఐ ఎదుట రోడ్డుపై నీరు నిలుస్తోందని కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా రూ.15 లక్షలతో కల్వర్టు, రూ.5లక్షలతో డ్రైనేజీ కాల్వ నిర్మించాలన్నారు. కొండగడప, బుజిలా పురం గ్రామాల్లో శ్మశానవాటికల అభివృద్ధికి రూ.5లక్షల చొప్పున, కొండగడపలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయడానికి సీడీపీ నిధులు రూ.5 లక్షలు, సుందరయ్యకాలనీలో డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి రూ.20లక్షలు కేటాయించా లన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్‌చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, కమిషనర్‌ షేక్‌ మహమూద్‌, మేనేజర్‌ ప్రభాకర్‌, టీపీవో వీరస్వామి, ఎంఏఈ వెంకటేష్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-29T07:08:55+05:30 IST