తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2021-04-16T05:37:21+05:30 IST

‘నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్న పోలీసులూ ఖబడ్దార్‌. ఇప్పటికే నాపై ఐదు తప్పుడు కేసులు బనాయిం చారు. ఇంకా ఎన్నికేసులు పెడతారో పెట్టుకోండి. మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. పోలీస్‌ వ్యవస్థపై న్యాయపోరాటం చేస్తా’నని టీడీపీ శ్రీకాకుళం పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ హెచ్చరించారు. పొం దూరు పొలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయిన కూన రవిని రాజాం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.స్వాతి షరతులతో కూడిన బెయిల్‌ను ఆయనకు మంజూరు చేశారు.

తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకోం
రాజాం : కూన రవిని కోర్టుకు తీసుకువస్తున్న పోలీసులు

 పోలీస్‌ వ్యవస్థపై న్యాయపోరాటం చేస్తా

 టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ 

రాజాం/రూరల్‌, ఏప్రిల్‌ 15: ‘నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్న పోలీసులూ ఖబడ్దార్‌. ఇప్పటికే నాపై ఐదు తప్పుడు కేసులు బనాయిం చారు. ఇంకా ఎన్నికేసులు పెడతారో  పెట్టుకోండి. మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. పోలీస్‌ వ్యవస్థపై న్యాయపోరాటం చేస్తా’నని టీడీపీ శ్రీకాకుళం పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ హెచ్చరించారు. పొం దూరు పొలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయిన కూన రవిని రాజాం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.స్వాతి షరతులతో కూడిన బెయిల్‌ను ఆయనకు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయ స్థానం ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థతో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై విరుచుకుపడ్డారు. అధికారపార్టీకి తొత్తులుగా ఉండాలంటే యూనిఫాం తీసి, వైసీపీ కండువాలు కప్పుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావాలని పొలీసులకు సూచించారు. స్వగ్రామం లోని నా ఇంట్లో నేనుంటే నాపై తప్పుడు కేసులు బనాయించారని, మీకు దమ్ము, నిజాయితీ ఉంటే నేను చేసిన తప్పేంటో, నేరం ఏంటో రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని కేసులు బనాయిం చినా భయపడేది లేదన్నారు. ఆమదాలవలసలో స్పీకర్‌ సీతా రాం, అతని కొడుకు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఆరోపిం చారు. ఇసుక, మైనింగ్‌, భూ దోపిడీలు ఎక్కువవుతున్నాయని, వారి ఆగడాలను అణగదొక్కేందుకు టీడీపీ నాయకులు, కార్య కర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 


 రాజాంలో ఉత్కంఠ.. ఉద్రిక్తత


కూన రవికుమార్‌ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సంద ర్భంగా రాజాంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. సామాజిక ఆసుపత్రి, న్యాయస్థానం ప్రాంగణం వెలుపల, బయట భారీగా పోలీసులు మోహరించారు. శ్రీకాకుళం, పాలకొండ డీఎస్పీలు మహేంద్ర, శ్రావణిల సారధ్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, భారీగా పొలీ సులు, ప్రత్యేక బృందాలతో ఆయా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిం చింది. రవిని కోర్టులో హాజరుపరిచే ముందు సామాజిక ఆసుపత్రిలో ఆయ నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 


బెయిల్‌ మంజూరు

పొందూరు: టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవి కుమార్‌ గురువారం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ చంద్రశేఖర్‌ సమక్షంలో లొంగిపో యారు. ఈ నెల 8న పెనుబర్తిలో చోటుచేసుకున్న ఘర్షణ విషయంలో కూన రవిపై పోలీ సులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇదే కేసులో రవికుమార్‌ వర్గానికి చెందిన 29 మందికి ఇదివరకే కోర్టులో బెయిల్‌ మంజూరైంది. గురు వారం రవికుమార్‌ పొందూరులో లొంగిపోనున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అక్క డకు చేరుకున్నారు. రవికుమార్‌ గురువారం లొంగిపోగా, పొందూరు పోలీసులు ఆయనను రాజాం కోర్టుకు తరలించారు. అక్కడ ఆయనకు బెయిల్‌ మంజూరైంది. 

Updated Date - 2021-04-16T05:37:21+05:30 IST