Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 16 2021 @ 07:45AM

జమ్మూకశ్మీర్‌లో encounter...లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

పుల్వామా: జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పాంపొరి ప్రాంతంలో శనివారం ఉదయం కేంద్ర భద్రతాదళాలకు,  ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. భగత్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఇద్దరు పోలీసులను హతమార్చిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఉమర్ ముస్తాఖ్ ఖాండేను శనివారం ఎన్‌కౌంటర్ అయ్యాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయకుమార్ చెప్పారు. పాంపొరి సమీపంలోని డ్రాంగ్ బల్ ఏరియాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐజీ ట్వీట్ చేశారు. లష్కరే తోయిబా టాప్ టెన్ కమాండర్లు అయిన సలీం పర్రే, యూసుఫ్ కాంట్రో, అబ్బాస్ షేఖ్, రియాజ్ షెతర్ గుండ్, ఫారూఖ్ నలి, జుబేర్ వాని, అష్రఫ్ మౌల్వీ, సాఖిబ్ మంజూర్ వకీల్ షాల కోసం తాము గాలిస్తున్నామని ఐజీ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement