Abn logo
Oct 13 2021 @ 17:23PM

బెయిలివ్వండి..బాధపెట్టొద్దు: ఆర్యన్ లాయర్

ముంబై: రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, ఇతరుల బెయిల్ అభ్యర్థనపై వాదనలు పూర్తయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఆర్యన్ ఖాన్ తరఫున ఆయన న్యాయవాది అమిత్ దేశాయ్ సుమారు గంటన్నర సేపు తన వాదనలు వినిపించారు. 5.30 గంటలకు కోర్టు పనివేళలు ముగియనున్నందున ఈలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది. కోర్టు విచారణ సందర్భంగా అమిత్ దేశాయ్ తన వాదన వినిపిస్తూ, ఆర్యన్‌ సహా పలువురు తెలిసీ తెలియని వయసున్న యువకులని, కొన్ని దేశాల్లో ఈ పదార్ధాలు (పట్టుబడిన డ్రగ్స్) చట్టబద్ధమేనని అన్నారు. ''వీళ్లంతా చిన్న పిల్లలు. బెయిల్ తోసిపుచ్చద్దు. వాళ్ల పరిస్థితిని మరింత దయనీయం కానీయకండి. ఇప్పటికే వాళ్లంతా చాలా బాధపడుతున్నారు. వాళ్లే గుణపాఠం నేర్చుకుంటారు. వాళ్లేమీ అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారో, సరఫరా చేసేవారో, రాకెటీర్సో కాదు'' అని కోర్టుకు విన్నవించారు.

ఇవి కూడా చదవండిImage Caption