ఆస్పత్రి ఆవరణలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-05-11T06:16:44+05:30 IST

వంద పడకల ప్రభుత్వాస్పత్రి సముదాయం ఆవరణలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు.

ఆస్పత్రి ఆవరణలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలి
ఆస్పత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

-  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

వేములవాడ టౌన్‌, మే 10 : వంద పడకల ప్రభుత్వాస్పత్రి   సముదాయం ఆవరణలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. వేము లవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌ ఆస్పత్రిని సోమవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మెడికల్‌ పరికరాలు వచ్చిన వెంటనే ఆస్పత్రిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదే శించారు. ఐసీయూ, జనరల్‌ వార్డుల్లో  సౌకర్యాలను కల్పించాలన్నారు.  తుదిదశ పనులు పెండింగ్‌ ఉంటే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.  ఆస్పత్రి   ఆవ రణలో  మొక్కలను నాటాలని సూచించారు.   ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఇన్‌చార్జి అధికారి రేగులపాటి మహేష్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, తహసీల్దార్‌ మునీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు ఉన్నారు. 

Updated Date - 2021-05-11T06:16:44+05:30 IST