Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 15 2021 @ 08:15AM

గ్యాస్,పెట్రో ధరల పెంపునకు వినూత్న నిరసన...సిలిండర్లతో Garba డాన్స్

సూరత్ (గుజరాత్): విజయదశమి సందర్భంగా గ్యాస్, పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా సూరత్ జిల్లా వాసులు సిలిండర్లు, పెట్రోల్ క్యాన్లను తలపై పెట్టుకొని గర్బా డాన్స్ చేశారు. ఇటీవల పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునపై ఆగ్రహంతో ఉన్న సూరత్ జిల్లా పూనా గ్రామవాసులు వినూత్న నిరసన తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 వరోజు గుజరాతీ జానపద నృత్యం అయిన గర్బా ను సిలిండర్లు, పెట్రోల్ క్యాన్లను నెత్తిపై పెట్టుకొని చేశారు. మహిళలతోపాటు గ్రామస్థులు, పిల్లలు కలిసి గర్బా డాన్స్ చేశారు. 


గ్యాస్, పెట్రోలు ధరల పెంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పేందుకే తాము గ్యాస్ సిలిండర్లతో గర్బా డాన్స్ చేశామని పూనా గ్రామ సత్యనారాయణ్ సొసైటీ వాసులు చెప్పారు. ‘‘మేము గర్బా డాన్స్ చేస్తున్న సమయంలో సిలిండర్ బరువును మోయడం లేదు. మేము ద్రవ్యోల్బణం యొక్క బరువును మోస్తున్నాం.ధరల పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ధరలను తగ్గించమని ప్రభుత్వానికి చెప్పేందుకే సిలిండర్లతో డాన్స్ చేశాం.’’ అని గ్రామస్థులు చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement