ఎక్కడికక్కడే కట్టడి

ABN , First Publish Date - 2021-05-15T05:54:38+05:30 IST

లాక్‌డౌన్‌ సందర్భంగా జిల్లాలో ప్రజలను బయట తిరుగకుండా పోలీ సులు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. శుక్రవారం మూడో రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగానే కొనసాగింది. లాక్‌డౌన్‌ నిబంధ నలు పాటించని వారికి జరిమానా విధించారు.

ఎక్కడికక్కడే కట్టడి
పోలీసులకు సూచనలు చేస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

- మూడో రోజు పోలీసుల తనిఖీలు ముమ్మరం  

- ఉదయం రద్దీ.. మధ్యాహ్నం నిర్మానుష్యం

- 280 మంది వాహనదారులు, 12 మంది వ్యాపారులపై కేసు  - లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన ఎస్పీ 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

లాక్‌డౌన్‌ సందర్భంగా జిల్లాలో ప్రజలను బయట తిరుగకుండా పోలీ సులు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. శుక్రవారం మూడో  రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగానే కొనసాగింది. లాక్‌డౌన్‌ నిబంధ నలు పాటించని వారికి జరిమానా విధించారు. రంజాన్‌ పండుగ కావడంతో ఉదయం పది గంటల వరకు సిరిసిల్ల మార్కెట్‌, బస్టాండ్‌, పెద్దబజార్‌, ప్రాంతాల్లో జనం కిక్కిరిసి పోయారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాలు రద్దీగా కనిపించాయి. 10 గంటల తరువాత పోలీ సులు దుకాణాలను మూయించారు. జిల్లాలో 280 మంది వాహన దారులు, 12 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. వాహనా ల తనిఖీ చేపట్టి అనుమతి పత్రాలు ఉన్న వారిని మాత్రమే వదిలి పెట్టారు. జిల్లా క్రేందంలో ప్రధాన కూడళ్లు ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోయాయి. జిల్లా సరిహద్దుల్లో పికెట్‌ ఏర్పాటు చేసి కట్టు దిట్టం చేశారు. 

పర్యవేక్షించిన ఎస్పీ..

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ను జిల్లా ఎస్పీ రాహూల్‌హేగ్డే పర్యవేక్షించారు. సిరిసిల్లలోని అంభేద్కర్‌ చౌరస్తా, పాత బ స్టాండ్‌, వెంకంపేట, సుందరయ్యనగర్‌, బీవైనగర్‌, ఇందిరానగర్‌, కొత్త బస్టాండ్‌ ప్రాం తాల్లో స్వయంగా తిరిగి పరిశీలించారు. నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వాహానదారులకు జరి మానాలు విధించాల్సిందిగా సిబ్బందిని అదేశించారు. నిబంధనలకు విరు ద్ధంగా తెరచి ఉంచిన దుకా ణాదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాటా ్లడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ జిల్లా పరిధిలో కఠినంగా అమలు అవుతుందని అన్నారు. జిల్లా ప్రజలు లాక్‌డౌ న్‌ అమలుకు సహకరిస్తు న్నారని తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ అనిల్‌కుమార్‌, ఎస్‌ఐ సుధాకర్‌, శిక్షణ ఎస్‌ఐ సంధ్య తదితరులు ఉన్నారు. 

 వీర్నపల్లి: వీర్నపల్లి మండలంలో ఎస్సై రవీందర్‌గౌడ్‌ నేతృత్వంలోని పోలీసు సిబ్బంది పక్కాగా లాక్‌డౌన్‌ అమలుకు కృషిచేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చేవారికి తగు విధంగా మందలించి జరిమానాలు విధిస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి రావద్దని, వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవీందర్‌గౌడ్‌ హెచ్చరించారు. 

గంభీరావుపేట: గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మ చెక్‌పోస్ట్‌ వద్ద స్థానిక ఎస్సై సౌమ్య కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో కారణాలు లేకుండా వస్తున్న వాహనాలను నియంత్రించేందుకు జరిమానా విధించారు. అత్యవరమైతేనే బయటకు రావాలని,  అనవసరంగా రావద్దని ఎస్సై సూచించారు.  

 వేములవాడలో..

వేములవాడ : వేములవాడ పట్టణంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా రెండవ దశ నియంత్రణలో భాగంగా ప్రతీ రోజు ఉదయం పది గంటలకే మందుల దుకాణాలు,  ఆస్పత్రులు మినహా అన్ని రకాల దుకాణాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నారు. శుక్రవారం ఉదయం లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో కూరగాయల మార్కెట్‌తోపాటు వివిధ దుకాణాలు రద్దీగా కనిపించాయి. పట్టణ సీఐ  వెంకటేశ్‌ లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు.  

ఆహారపొట్లాల పంపిణీ

లాక్‌డౌన్‌లో ఆకలితో అలమటిస్తున్న పేదలు, యాచకులకు స్థానిక సామాజిక సేవకుడు పొలాస (వంటల) రాజేశం శుక్రవారం ఆహార పొట్లాలను అందజేశారు.

చందుర్తి: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో  శుక్రవారం ప్రధాన వీధులు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.  మర్రిగడ్డ, మూడపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొద్దిపాటి  రైతుల హడావుడి కనిపించింది. మండలంలోని మర్రిగడ్డలో కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై ఎస్సై సునీల్‌, పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు.   

Updated Date - 2021-05-15T05:54:38+05:30 IST