చల్లని చేతులు

ABN , First Publish Date - 2020-04-04T11:34:23+05:30 IST

లాక్‌డౌన్‌ నేప థ్యంలో పేదల కోసం అనేక సంస్థలు ఉదారంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను నిర్వహి స్తున్నాయి.

చల్లని చేతులు

ఒంగోలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 3 : లాక్‌డౌన్‌ నేప థ్యంలో పేదల కోసం అనేక సంస్థలు ఉదారంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను నిర్వహి స్తున్నాయి.  శుక్రవారం జిల్లాలో పలు సంస్థల ఆధ్వ ర్యంలో అనేక పేద కుటుంబాలకు నిత్యావసర వస్తు వులను పంపిణీ చేశారు. కర్నూల్‌ రోడ్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక జయప్రకాష్‌ కా లనీలోని 100 పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు  శిరసనగండ్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 50 పేద కుటుంబాలకు బి య్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు పంపిణీ చే శారు.


  సీతారావమ్మ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. స్థానిక మోటూరు ఉదయం కాలనీలోని 50 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు ఇచ్చారు. జనసేన ఒంగోలు పా ర్లమెంట్‌ ఇన్‌చార్జి షేక్‌ రియాజ్‌ సూచనతో స్థానిక 33వ డివిజన్‌లో పేదలకు ఆ పార్టీ కార్యకర్తలు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.   జిల్లా ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ అసోసియేషన్‌ సహకారంతో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు స్థానిక వడ్డెపాలెంలో 100 కుటుంబాలకు కూరగాయలను పం పిణీ చేశారు. స్థానిక మంగమూరు రోడ్డు మర్రిచెట్టు ప్రాంతంలో పశుపో షకులకు జడ్పీ కాలనీ శ్రీరామ భక్తమండలి ప్రతినిధులు 50 కట్టల గ్రాసాన్ని అందజేశారు.  


ఒంగోలు (కార్పొరేషన్‌) : పోలీసు సిబ్బందికి జిల్లా వాలీబాల్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో టోపీలు, కళ్లజోళ్లు అందజేశారు. అసోసియేషన్‌ చైర్మన్‌ సూదనగుంట కోటేశ్వరరావు తాలూకా పోలీసు స్టేషన్‌లో సీఐ లక్ష్మణ్‌ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.


ఒంగోలు(కలెక్టరేట్‌) : జువెనైల్‌ వేల్పర్‌ శాఖ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న స్వచ్చంద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు 93 మందికి కలెక్టర్‌ భాస్కర్‌ బియ్యం, కందిపప్పు మంజూరు చేశారని జిల్లా పర్యవేక్షణ అధికారి వై.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. 


కొండపి : మూగచింతల, గుర్రప్పడియ గ్రామాల్లోని పేదలకు బి య్యం, కూరగాయలు, మాస్క్‌లు, శానిటైజర్లను పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాశి వెంకయ్య అందజే శారు.  పెరిదేపిలోని 25 ఎస్టీ కుటుంబాలకు బియ్యం, కూరగాయలను సీపీ ఎంనాయకులు ముప్పరాజు కోటయ్య, గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, కేజీ మస్తాన్‌, ము ప్పరాజు అందజేశారు. చోడవరంలో 250 మందికి నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి బొడ్డపాటి బ్రహ్మయ్య మాస్క్‌లను పంపిణీ చేశారు. 

 

కొండపిలోని జాళ్లపాలెం రోడ్డులో నివసిస్తున్న  పేదలకు ఏసురత్నం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను కొండపి తహసీల్దార్‌ కార్యాలయం, ఏఎస్‌వో శ్రీనివాసులు, ఆర్‌ఐ హనుమంతరావు అందజేశారు.   కొండపిలోని టంగుటూరు రోడ్డులోని గురుకుల పాఠశాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్న కూలీలకు రిలీఫ్‌ సెంటర్‌  ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసినట్టు కొండపి ఎస్సై ఎన్‌సీ ప్రసాద్‌ తెలిపారు.     కొండపిలోని యాచకులకు, ఆస్పత్రిలోని ఉద్యోగులకు, రోగులకు,  చోడవరం కమలా డెయిరీ ఎండీ, మాజీ ఎంపీపీ రావిపాటి మఽఽధుసూదనరావు  ప్రతి రోజూ ఆహారాన్ని  సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగినే వరకు  ఆహారం అందిస్తానని ఆయన తెలిపారు. ఎస్సై ఎన్‌సీ ప్రసాద్‌, సీహెచ్‌సీ డాక్టర్‌ భక్తవత్సలంతో కలిసి శుక్రవారం భోజనం పంపిణీ చేశారు. 


పామూరు : కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌ తన క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులకు సొంత నిధులతో బియ్యం, నిత్యావసరాలను అందజేశారు.


వెలిగండ్ల : హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, పద్మాపురం గ్రామాల్లో ద ద్దాల నారాయణ సహకారంతో వైసీపీ నాయకుడు జనార్దన్‌ రెడ్డి 600 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు. 


కనిగిరి టౌన్‌ : అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్‌ రమేష్‌కు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ  సుబ్బారావు ఆదేశాల మేరకు యా నియన్‌ జిల్లా నాయకుడు  షఫీ తదితరులు రూ. 25 వేలు ఆర్థిక సహాయా న్ని అందజేశారు. పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో పేదలకు ఎమ్మెల్యే మ ధుసూదన్‌ యాదవ్‌ బియ్యం, కూరగాయాలు, మాస్కులు పంపిణీ చేశారు. 


 హనుమంతునిపాడు : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు హాజీపురం గ్రామంలో ఆ పార్టీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. 


సీఎస్‌పురం :  సీఎస్‌పురంకు చెందిన ఫక్రుద్దీన్‌ అందించిన నిత్యావస ర సరుకులను స్థానిక పోలీస్‌స్టేసన్‌లో పంపిణీ చేశారు.  స్థానిక ఎస్టీ కా లనీలోని ప్రజలకు సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోజన సదుపాయం మూడవరోజు శుక్రవారం కూడా కొనసాగింది.


చీరాల : కాంగ్రెస్‌ పార్టీ చీరాల నియోజవకవర్గ ఇన్‌చార్జి  దేవరపల్లి రంగారావు సుమారు వెయ్యిమందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. చీరాల, వేటపాలెం ప్రాంతాల జర్నలిస్టులకు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఏఎంసీ చైర్మన్‌ మార్పు గ్రెగోరి నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. 


వేటపాలెం : చీరాల సర్కిల్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీస్‌ సిబ్బందికి ప్రతిరోజు భోజనాల కోసం పట్టభద్రుల సంఘం ఆఽధ్వర్యంలో రూ. 51 వేలు ఎస్సై వి.అజయ్‌బాబుకు అందజేశారు. 

ఫ బల్లికురవ : కొండాయపాలెంలో మారం వెంకారెడ్డి గ్రానైట్‌ క్వారీ సహకారంతో 400 కుటుంబాలకు కూరగాయలను తహసీల్దార్‌ మధుసూధన రావు, ఎస్సై శివనాంచారయ్య పంపిణీ చేశారు.  పంగులూరు మండలంలోని రామకూరుకు చెందిన వలంటీర్‌ షేక్‌ నజీర్‌ సీఎం సహాయనిధికి రూ.5 వేలు అందజేశారు. 


దర్శి : ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పట్టణంలోని పేదలకు నిత్యావ సరాలను, పోలీసులకు భోజన భోజనాలను పంపిణీ చేశారు. 


ముండ్లమూరు : బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్‌ ట్ర స్టు ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్ట్‌లకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నిత్యావసర సరుకులను  పంపిణీ  చేశారు. శంకరాపురం గ్రా మానికి చెందిన వైసీపీ నాయకుడు మేడికొండ శేషగిరి, జయంతి ఆధ్వ ర్యంలో 1,000 మాస్క్‌లను అందజేశారు. లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో పోలీసు లకు, పేదలకు మజ్జిగ పంపిణీ చేశారు.


కురిచేడు : పలువురు దాతలు రూ. 2.75 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. 


చీమకుర్తి :  రాసన్‌, నాసా గ్రానైట్‌ క్వారీ అధినేత రవీంద్రా రెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి రూ.10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.  చెక్కును క్వారీ మేనేజర్లు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. 


సంతనూతలపాడు : ఎస్‌ఎన్‌పాడులోని పేదలకు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ అంకారావు ఆధ్వర్యంలో సాంబర్‌ అన్నం, పెరుగన్నం అందజేశారు. లాక్‌డౌన్‌ ముగిసేవరకు నిరుపేదలకు అన్నదానం చేస్తామన్నారు. 


లింగసముద్రం, ఏప్రిల్‌ 3 : లింగసముద్రం పంచాయతీలోని 400 కుటుంబాలకు  వైసీపీ మండలకన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి  కూరగాయ లు పంపిణీ చేశారు.


కందుకూరు : క్వారంటైన్‌ కేంద్రాలు,  వసతి గృహాల నిర్వహణకు  రంగా పార్టికల్‌ బోర్డ్స్‌ పరిశ్రమ యాజమాన్యం రూ.2.51 లక్షలు, వైసీపీ  నా యకుడు గొట్టిపాటి రోశయ్య, ఆయన సోదరుడు గొట్టిపాటి మార్కండేయులు రూ.లక్ష, మాచవరానికి చెందిన సూరం వేణు గోపాల్‌రెడ్డి రూ. లక్ష, వరసిద్ధి వినాయక గ్యాస్‌ ఏజెన్సీస్‌ యజమాని ఉప్పుటూరి కిరణ్‌  రూ.25వేలు అందజేశారు. నగదును కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి సమక్షంలో డీఎస్పీ కండే శ్రీనివాసరావుకు ఇచ్చారు.  శ్రీవారి సేవాసమితి ఆధ్వర్యంలో శెట్టి వెంకటకృష్ణారావు సహకారంతో పట్టణంలో పేద కుటుం బాలకు బియ్యం పంపిణీ చేశారు.  


ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెంలో వాసవీ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ గోళ్ల వెంకటసుబ్బారావు సమకూర్చిన శానిటైజర్లను ఎస్సై ముక్కంటి పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మెడబలిమి వెంకటేశ్వర రావు గిరిజన గూడెంలో 300 మంది గిరిజనులకు, పుల్లలచెరువు మండలం మల్లాపాలెం చెక్‌పోస్టు వద్ద 200 మంది వలస కూలీలకు పులిహోర, పెరుగు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. గంజివారిపల్లె ఎస్సీకాలనీలో 150 కుటుంబాలకు వైసీపీ నాయకులు దుగ్గెంపూడి వెంకటసుబ్బారెడ్డి, గంజి చెన్నారెడ్డి కూరగాయాలను అందజేశారు. 


వలేటివారిపాలెం :  నూకవరం ఎస్సీ కాలనీవాసులకు  గ్రామానికి చెందిన  గుర్రం ఆదిలక్షమ్మ, మాజీ సర్పంచ్‌ ఇంటూరి యలమంద నిత్యావ స టరాలను పంపిణీ చేశారు.  


మార్టూరు : మండల టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పఠాన్‌ ఖాదర్‌వలి పోలీసులు, ఉపాధ్యాయులు, ముఠా కూలీలకు  మాస్కులను పంపిణీ చేశారు. 


నూతలపాడు(పర్చూరు),  :  నూతలపాడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద డీసీఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథంబాబు పోలీసులకు, ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్లు, పంపిణీ చేశారు. 


మార్కాపురం(వన్‌టౌన్‌) : పట్టణంలోని ఎస్‌ఎస్‌.నగర్‌లో మార్కాపురం బార్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో  సంచరిత జాతుల వారికి జిల్లా ఆరవ అదనపు జడ్జి రామకృష్ణ చేతుల మీదుగా  నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.    పూలసుబ్బయ్య కాలనీలోని  ఎస్టీలకు ఇళ్ల  బా షా ట్రస్టు ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు.  


పొదిలి/తర్లుపాడు  :  స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాలలో సంస్థ యాజమాన్యం, రాష్ట్ర వైసీపీ నాయకుడు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పొదిలి మండలంలోని 35 మంది జర్నలిస్టులకు బియ్యం, కందిపప్పును అందజేశారు.   


కంభం  :  కంభంకు చెందిన  వైసీపీ నాయకులడు చేగిరెడ్డి లింగారెడ్డి సీఎం సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం అందించారు. 


కొమరోలు (గిద్దలూరు):  కొమరులో ప్రభుత్వ పాఠశాల సమీపంలో గుడారాలలో నివాసం ఉంటున్న 20 పేద కుటుంబాలకు మాజీ సైనికుడు పి.ఖాదర్‌వలి నిత్యావసరాలను అందజేశారు. 


గిద్దలూరు టౌన్‌ : పోలీసులకు మాలవిక డెవలపర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముత్యాలపాటి రంగనాయకులు వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ, బిస్కెట్లను పంపిణీ చేశారు. మండల న్యాయసేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్‌ వలంటీర్‌ అద్దంకి మదుసూదన్‌రావు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌, రాచర్లగేటు కూడలి, రైల్వేస్టేషన్‌, కుమ్మరాంకట్ట, గాంధీబొమ్మ కూడలి, పొట్టిశ్రీరాములు కూడలిలోని నిరాశ్రయులకు, పోలీసు సిబ్బందికి  మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.  మున్సిపల్‌ కార్యాలయ సిబ్బందికి, జర్నలిస్టులకు మాస్క్‌లు, శానిటైజర్లను ఎమ్మెల్యే అన్నా రాంబాబు అందజేశారు. 

 

ఒంగోలు (కార్పొరేషన్‌) : క్రికెట్‌ ప్రకాశం ఆధ్వర్యంలో పోలీసులకు బియ్యం, నిత్యవసరాలు స్థానిక ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద సీఐ భీమానాయక్‌  పంపిణీ చేశారు.  

Updated Date - 2020-04-04T11:34:23+05:30 IST