పాకిస్థాన్‌పై మిడతల దాడి ... ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-02-02T21:36:31+05:30 IST

పాకిస్థాన్‌లో మిడతల దండయాత్ర జరుగుతోంది. లక్షల సంఖ్యలో మిడతలు పంటలను తినేస్తున్నాయి. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో

పాకిస్థాన్‌పై మిడతల దాడి ... ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

      • సింధ్‌, పంజాబ్‌లో భారీగా పంట నష్టం
      • అధిక పంట నష్టం జరగకుండా నివారణ చేపట్టండి
      • అధికారులకు పాక్ ప్రధాని నిర్దేశం
      • పాక్ అధికారుల నిర్లక్ష్యంతో భారత్‌లో ప్రవేశించిన మిడతలు
      పాకిస్థాన్‌లో మిడతల దండయాత్ర జరుగుతోంది. లక్షల సంఖ్యలో మిడతలు పంటలను తినేస్తున్నాయి. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో ఇప్పటికే పంటలన్నీ మిడుతలు తినేశాయి. ఇప్పుడు పంజాబ్(పాకిస్థాన్)ని చుట్టుముట్టాయి. అక్కడ భారీ స్థాయిలో పంట నష్టం జరగిందని సమాచారం.
       
      ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం శనివారం జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. మిడతలని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టమని పాక్ ప్రధాన మంత్రి అధికారులను నిర్దేశించారు.
       
      మార్చి 2019లో భారీ సంఖ్యలో మిడతలు పాక్‌లో ప్రవేశించాయి. అప్పటి నుంచి సింధ్, దక్షిణ పంజాబ్, ఖైబర్ పష్తూన్ ఖ్వా ప్రాంతాలలో దాదాపు 9 లక్షలకు పైగా హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పంటలు, చెట్లను ఇవి నాశనం చేశాయి. పాకిస్థాన్‌ సరిహద్దులు దాటి ఈ మిడతలు భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా ప్రవేశించాయి. కానీ భారత దేశంలో సమయానికి అధికారులు చర్యలు చేపట్టడంతో పంట నష్టం భారీగా జరగలేదు.
       
      ఇంతకుముందు 1993లో ఇలాంటి మిడతల సమస్య వచ్చిందని, ఇవి సాధారణంగా ఎడారి ప్రాంతంలో నివసించే మిడతలని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో అధికారలు సరైన సమయంలో నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇవి భారత్‌లోకి ప్రవేశించాయని వారు అభిప్రాయపడుతున్నారు.

    ADVERTISEMENT

    Updated Date - 2020-02-02T21:36:31+05:30 IST