జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో లోకేష్ పుట్టిన రోజు వేడుక

ABN , First Publish Date - 2022-01-23T22:09:25+05:30 IST

టీడీపీ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు అట్టహసంగా నిర్వహించాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో లోకేష్ పుట్టిన రోజు వేడుక

జంగారెడ్డిగూడెం: టీడీపీ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు అట్టహసంగా నిర్వహించాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో  లోకేష్ పుట్టిన రోజు వేడుకను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యాం చంద్ర శేషు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. లోకేష్ పుట్టిన రోజు వేడుకలో జిల్లా అధికార ప్రతినిధి రాజపాల్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, అధికార ప్రతినిధి వందనపు రమణ, తడికమల్ల గోపాల్,లక్కవరం గ్రామ పార్టీ అధ్యక్షులు గద్దె వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T22:09:25+05:30 IST