చిటికెన వేలిపై గోవర్ధనగిరి

ABN , First Publish Date - 2020-07-19T05:30:00+05:30 IST

ప్రతి సంవత్సరం బృందావనంలోని ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుడిని ప్రార్థించేవారు. ప్రత్యేక పూజలు చేసేవారు. ఒక ఏడాది కృష్ణుడు ధర్మం గురించి, దాని ప్రాధాన్యం గురించి గ్రామస్థులకు వివరించాడు...

చిటికెన వేలిపై గోవర్ధనగిరి

ప్రతి సంవత్సరం బృందావనంలోని ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుడిని ప్రార్థించేవారు. ప్రత్యేక పూజలు చేసేవారు. ఒక ఏడాది కృష్ణుడు ధర్మం గురించి, దాని ప్రాధాన్యం గురించి గ్రామస్థులకు వివరించాడు. చిత్తశుద్ధితో, కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ విధిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. కృష్ణుడు చెప్పిన దానికి అందరూ సరేనన్నారు. వారు ఆ ఏడాది ఇంద్రుడికి ఎలాంటి పూజలూ నిర్వహించలేదు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. బృందావనంపై భారీ వర్షం కురిపించాడు. వరద నీటితో గ్రామస్థులందరూ భయపడిపోయారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఆ పర్వతం కిందకు గ్రామస్థులందరూ చేరి తలదాచుకున్నారు. దాంతో ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని వర్షాన్ని ఆపాడు.


Updated Date - 2020-07-19T05:30:00+05:30 IST