Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.20 లక్షల విలువైన ఖైనీ,గుట్కాలతో లారీ స్వాధీనం

విశాఖపట్నం, డిసెంబరు 3: విశాఖనగరం కంచరపాలెం పారిశ్రా మికవాడ సమీపంలో నిషేధిత ఖైనీ, గుట్కా తరలిస్తున్న లారీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అందులో ఉన్న దాదాపు 20 లక్షల రూపాయల విలువచేసే సరుకు స్వాధీనం చేసుకుని కంచరపాలెం పోలీసులకు అప్ప గించారు. కలకత్తా నుంచి నగరానికి చేరుకున్న ఈ లారీని పారిశ్రామిక వాడ ప్రాంతంలో పార్క్‌ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడిచేసి తనిఖీ చేయగా నిషేధిత వస్తువులు దొరికాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. 

Advertisement
Advertisement