Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ. లక్షల్లో నష్టం జరిగితే రూ.2 వేలిస్తారా..!

 ప్రభుత్వ తీరును దుయ్యపట్టిన అజీజ్‌ 

నెల్లూరురూరల్‌, నవంబరు 29 : వరదలు, భారీ వర్షాల కారణంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు రూ. లక్షల్లో నష్టపోతే కేవలం రూ. 2 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా...? అని టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌అజీజ్‌  ప్రభుత్వ తీరును దుయ్యపట్టారు. నెల్లూరురూరల్‌ పరిధిలోని బుజబుజనెల్లూరు, రామకోటయ్యనగర్‌ ప్రాంతాల్లో ఆయన సోవామరం వరద బాధితులను  పరామర్శించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ జరిగిన నష్టానికి రూ. 2 వేలు ఏ విధంగా సరిపోతాయో వైసీపీ నాయకులు, ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 10 వేలు, దెబ్బతిన్న ఇంటికి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పునరావాస కేంద్రాల్లోన బాధితులకు నాణ్యమైన సౌకర్యాలు, ఆహారం అందడం లేదని ఆరోపించారు. రోడ్ల దుస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జెన్నీ రమణయ్య,  జలదంకి సుధాకర్‌, మాతంగి కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement