జోరుగా కొవిడ్‌ వాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-10-23T06:22:12+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డోసులు పది లక్షల మార్క్‌ను దాటాయి. జిల్లాలో యంత్రాంగం సమష్టి కృషితో వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టడంతో ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ వేశారు. మరో పదిహేను రోజులలోపు వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు ఏర్పాట్లను చేశారు.

జోరుగా కొవిడ్‌ వాక్సినేషన్‌
సాలూరలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న ఆర్డీవో



జిల్లాలో పది లక్షల మార్క్‌ దాటిన కొవిడ్‌ డోసులు

జిల్లావ్యాప్తంగా నిత్యం 360 కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్న వైద్య సిబ్బంది

నిజామాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డోసులు పది లక్షల మార్క్‌ను దాటాయి. జిల్లాలో యంత్రాంగం సమష్టి కృషితో వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టడంతో ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ వేశారు. మరో పదిహేను రోజులలోపు వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు ఏర్పాట్లను చేశారు. ఇంటింటా కలియ తిరుగుతూ వ్యాక్సిన్‌ తీసుకోని వారందరికీ మొదటి డోసు ఇస్తున్నారు. రెండోడోసు కూడా వారి షెడ్యూల్‌ను బట్టి అన్ని పీహెచ్‌సీలు, ఇతర కేంద్రాల్లో వేస్తున్నారు.

ఫ గ్రామస్థాయిలోనూ ఊపందుకున్న టీకాలు

జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు ఇతర శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సహకరించడంతో గ్రామస్థాయిలో ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో శుక్రవారం నాటికి 10లక్షల మార్క్‌ను దాటి వ్యాక్సిన్‌ డోసులను వేశారు. జిల్లాలో 360 కేంద్రాల్లో ప్రతీరోజు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. పీహెచ్‌సీలే కాకుండ గ్రామాల పరిదిలో ఈ కేంద్రాల ను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు. జిల్లా లో ఇప్పటి వరకు 10లక్షల 9078 డోసులకుపైగా డోసులను వేశారు. వీటిలో 7లక్షల 73వేల మందికిపైగా మొదటి వవిడత డోసులు వేయగా 3లక్షల 33వేల మందికిపైగా రెండు విడతల డోసులు వేశారు. జిల్లాలో ప్రతీ రోజు పది నుంచి 14వేల మధ్య ఈ డోసులను వేస్తున్నారు. జిల్లాలో 18ఏళ్లు దాటిన వారు పది లక్షల 64వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి మరో 15రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు ఏర్పాట్ల ను చేశారు. జిల్లాకు గడిచిన నెలరోజులుగా వ్యాక్సిన్‌ సరఫరా పెంచడంతో ఈ టీకాలను వేగంగా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు కొన్ని వర్గాలు ముందుకురాకున్నా.. వారికి అవగాహన కల్పిస్తూ మొదటి డోసులను వేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఇతర పెద్దలను కలుపుకుని సమన్వయంతో వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తున్నారు. జిల్లాలో 10లక్షల డోసుల మార్క్‌ దాటిందని జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్‌ శివశంకర్‌తెలిపారు. ప్రతిరోజు ఈ వ్యాక్సినేషన్‌ను పెంచుతూ వేస్తున్నామన్నారు. వందశాతం మంది కి వేస్తే ఇమ్యూనిటి పెరగడంతో పాటు కరోనాను తట్టుకు నే అవకాశం ఉంటుందని టీకాలు వేగం పెంచామన్నారు. కరోనా తీవ్రత తగ్గిన మాస్కులు, సానిటైజర్‌లు తప్పనిసరి గా వాడాలని ఆయన కోరారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు సమన్వయం చేసుకుంటూ టీకాలు వేస్తున్నామని ఆయన తెలిపారు.

ఫ ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలి

బోధన్‌ రూరల్‌: మండలంలోని ప్రజలందరు కరోనా వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సాలూర పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఫ వ్యాక్సినేషన్‌పై ప్రచారం

 బోధన్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ వేయించుకోవడంపై ప్రతీ వార్డులో ప్రచారం ప్రారంభించారు. వ్యాక్సినేషన్‌ వేయించుకోవడంలో వెనుకడుగు వేయకూడదని, వ్యాక్సినేషన్‌ ఎంతో అవసరమని మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మావతిశరత్‌రెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్‌ శివానందం వెల్లడించారు. శుక్రవారం పలు వార్డులలో వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఇన్‌చార్జి కమిషనర్‌ పరిశీలించారు. ప్రజలు వ్యాక్సినేషన్‌ వేసుకోవడం పట్ల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యంత్రాంగం, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T06:22:12+05:30 IST