ప్రియురాలి పెళ్లి అని తెలిసి.. ప్రియుడు చేసిన నిర్వాకమిది!

ABN , First Publish Date - 2021-01-21T06:20:15+05:30 IST

ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి..

ప్రియురాలి పెళ్లి అని తెలిసి.. ప్రియుడు చేసిన నిర్వాకమిది!

ఫొటోలు పంపి.. పెళ్లి ఆపాడు 

మహేంద్రవాడలో ప్రియుడి నిర్వాకం

ప్రియురాలు కాబోయే భర్తకు వాట్సాప్‌ ఫొటోలు

ఆగిన వివాహం


అనపర్తి(తూర్పు గోదావరి): ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమవడంతో ఓ యువకుడు రగిలి పోయాడు. పెళ్లి కొడుకు వాట్సాప్‌కు కొన్ని ఫొటోలు, వీడియోలు పంపించాడు. అవి చూసిన పెళ్లి కుమారుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో పెళ్లి కాస్త ఆగిపోయింది. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే యువకుడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో యువతికి మరొకరితో వివాహం నిశ్చయించారు. బుధవారం వారి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈలోపు ప్రేమించిన యువకుడు పెళ్లికొడుకు వాట్సాప్‌కు యువతితో ఉన్న ఫొటోలు పంపించాడు. దీంతో పెండ్లి కుమారుడు పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి ఆగిపోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం ఆరా తీయడంతో యువకుడు చేసిన పని బయటపడింది. దీంతో యువతి బంధువులు అతనిని నిలదీశారు.  అనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో యువకుడిని అప్పగించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు అందితే చర్యలు చేపడతామని తెలిపారు.

Updated Date - 2021-01-21T06:20:15+05:30 IST