Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాపం.. ప్రేయసి కోసం తప్పుడు పని చేశాడు.. గొలుసులతో కట్టేసి పని చేయించుకుంటున్నారు..!

అతడి పేరు ఇమ్రాన్.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు.. ఒంటరివాడైన ఇమ్రాన్ రెస్టారెంట్‌లోనే కష్టపడి పనిచేసేవాడు.. ఇమ్రాన్ పనితనం చూసి యజమాని కూడా బాగానే డబ్బులు ఇచ్చేవాడు.. కొన్ని రోజుల తర్వాత ఇమ్రాన్‌కు ఫోన్ ద్వారా ఒక అమ్మాయి పరిచయమైంది.. ఆ పరిచయం ప్రేమగా మారింది.. అప్పట్నుంచి ఇమ్రాన్‌కు కష్టాలు మొదలయ్యాయి.. ప్రేమ మైకంలో ఇమ్రాన్ నేరస్థుడిగా మారాడు.. యజమానికే టోకరా వేశాడు.. ప్రస్తుతం అదే రెస్టారెంట్‌లో బంధీగా మారాడు. 


సాదాసీదా జీవితం గడుపుతున్న ఇమ్రాన్‌కు గతేడాది ఫోన్ ద్వారా ఒడిశాకు చెందిన ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకునే వారు. అమ్మాయిని కలిసేందుకు ఒడిశా వెళ్లాలని ఇమ్రాన్ అనుకున్నాడు. వచ్చేటపుడు తనకు బహుమతిగా బంగారు గొలుసు తీసుకురమ్మని ఆ యువతి అడిగింది. ఇమ్రాన్ దగ్గర అన్ని డబ్బులు లేవు. దీంతో యజమాని ఇంట్లోని బంగారు గొలుసు కాజేసి ఒడిశా వెళ్లి యువతికి వచ్చేశాడు. గోల్డ్ చైన్ పోయినట్టు తెలుసుకున్న యజమాని ఇమ్రాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


ఎన్నో ప్రయత్నాల అనంతరం ఇమ్రాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అంత డబ్బు తిరిగి ఇచ్చే పరిస్థితిలో ఇమ్రాన్ లేడని తెలుసుకున్న పోలీసులు అతడిని యజమాని రెస్టారెంట్‌లోనే పనికి పెట్టారు. రూ.లక్ష రూపాయల బాకీ తీరేవరకు అక్కడే పనిచేయాలని తీర్మానించారు. కొద్ది రోజులు పని చేసిన అనంతరం ఇమ్రాన్ అక్కడి నుంచి పారిపోయాడు. మళ్లీ ఎలాగోలా పట్టుకున్న యజమాని ఇమ్రాన్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. పగటి పూట రెస్టారెంట్‌లో పని చేయించుకుని రాత్రి అయ్యేసరికి గొలుసులతో బంధిస్తున్నాడు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement