Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 6 2021 @ 13:57PM

Love Marriage చేసుకున్న కుమార్తె.. తండ్రి వాట్సాప్‌కు ఫొటోలు.. రెండ్రోజుల్లోనే...!!

చెన్నై : అల్లారుముద్దుగా పెంచిన కుమార్తె చెప్పాపెట్టకుండా ప్రేమవివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కున్నత్తూరులో సంచలనం కలిగించింది. తిరుప్పూరు జిల్లా కున్నత్తూరు సమీపం పొలయాం పాళయంలో పొన్నుసామి (65), సుమతి (58) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరి కుమార్తె జనని (22) కోయంబత్తూరు కళాశాలో పిజియోథెరఫీ కోర్సు చదువుతోంది. కోవైలోని హాస్టల్‌ ఉంటూ చదువుతున్న జనని ఓ యువకుడిని ప్రేమించి ఇటీవల తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకుంది.

ఆ పెళ్లి ఫొటోలను రెండు రోజుల క్రితం తండ్రి వాట్పప్‌కు పంపింది. ఆ ఫొటోలను చూసి దిగ్ర్భాంతి చెందిన పొన్నుసామి, సుమతి దంపతులు దిగులు చెందారు. రెండు రోజులుగా చుట్టుపక్కలవారితో మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆ ఇంటి తలుపులు తెరచి వున్నా ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో చుట్టుపక్కలవారు లోపలకు వెళ్ళి చూశారు. పడకగదిలో పొన్నుసామి, సుమతి దంపతులు శవాలుగా పడి వుండటం చూసి విస్తుపోయి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కున్నత్తూరు పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆ దంపతులు అరటిపండులో విషం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నారు.


Advertisement
Advertisement