Advertisement
Advertisement
Abn logo
Advertisement

కత్రినా కైఫ్-విక్కీ కౌషల్ లవ్ స్టోరీ.. ఒక్క సినిమా కూడా కలిసి చేయని వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు కలిసి పనిచేసేటప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది కాస్త ప్రేమగా మారడం మనం చూస్తూ ఉంటాం. కానీ కనీసం ఒక్క సినిమాలో కూడా కలిసి పనిచేయకుండా ప్రేమలో పడే జంటలు అరుదు అనే చెప్పవచ్చు. ప్రస్తుతం పెళ్లిచేసుకోబోయే విక్కీ కౌషల్, కత్రినా కైఫ్‌ల ప్రేమ జంట కూడా అలాంటి అరుదైన కోవకు చెందుతుంది.ఈ సెటిబ్రిటీ జంటకు సినిమాలలో రాకుముందు పరిచయం కూడా లేకపోవడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  కత్రినా కైఫ్‌, విక్కీ కౌషల్‌ల లవ్ స్టోరీ చాలా సరదాగా మొదలైంది. 

వీరిద్దరి కలయికకు మొదటి కారణం బాలీవుడ్ సినీ దర్శకుడు కరణ్ జోషర్. ఆయన హోస్ట చేసే టాక్ షోలో ఒకసారి కత్రినా కైఫ్ తనకు కొత్తతరం హీరోలలతో విక్కీ కౌషల్ అంటే ఇష్టమని.. అతనితో కలిసి నటించాలని ఉందని చెప్పింది. అదే టాక్ షోలో మరోసారి విక్కీ కౌషల్ వచ్చినప్పుడు కరణ్ జోషర్ అతనికి కత్రినా విషయం చెప్పాడు. అప్పుడతను నిజమా.. అని చెబుతూ కింద పడిపోయాడు.పెళ్లి ప్రపోజల్.. అది కూడా సల్మాన్ ఖాన్ సమక్షంలో

2019 ఒక అవార్డ్ షోలో తొలిసారి ఒకరితోఒకరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకోవడమంటే... మామూలుగా కాదు విక్కీ కౌషల్ ఏకంగా పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అది కూడా కత్రినా మాజీ బాయ్‌ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ సమక్షంలో. అప్పడు కత్రినాతో విక్కీ స్టేజీపై మాట్లాడుతూ.. "నేను మీ వీరాభిమానిని. పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మీరు కూడా విక్కీ కౌషల్ లాంటి వాడిని పెళ్లిచేసుకుంటే బాగుంటుంది. విక్కీ కౌషల్ లాంటి వాడెందుకు.. విక్కీ కౌషల్‌నే వివాహం చేసుకోవచ్చు.. ఏమంటారు?" అని చెప్పాడు. దానికి సమధానంగా కత్రినా "నాకు ఇప్పుడు ఆ ధైర్యం లేదు" అని చెప్పింది. ఆ సమయంలో అందరూ ఇదంతా ఏదో తమాషాకి చెప్పి ఉంటాడనుకున్నారు.

కానీ ఆ తరువాత నుంచి ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం. అవార్డు ఫంక్షన్‌లలో పక్కపక్కనే కూర్చోవడం. చాలాసార్లు కత్రినా ఇంట్లో విక్కీ ఉండగా మీడియా కంటపడ్డాడు కూడా. 

ఆ తరువాత కత్రినా విక్కీ ని హత్తుకొని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ మీడియా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడు ప్రశ్నించినా ఇద్దరూ.. మాట దాటేసేవారు.


కొద్ది రోజుల క్రితమే.. కత్రినా కైఫ్‌ని విక్కీ పెళ్లిచేసుకోబుతున్నాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా ఒకవైపు రాజస్థాన్‌లోని ఒక పెద్ద కోటలో వారిద్దరూ చాలా తక్కువ మంది సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరితే వీరి వివాహానికి కేవలం 120 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement