బుల్లెట్‌పై ప్రేమ జంట హొయలు... ఆటోలో వెంబడించిన గ్రామస్తులు... చివరికి...

ABN , First Publish Date - 2021-08-03T17:18:42+05:30 IST

పైన కనిపిస్తున్న దృశ్యం ఏ సినిమాలోదో, లేదా ఏదో సీరియల్‌కు...

బుల్లెట్‌పై ప్రేమ జంట హొయలు... ఆటోలో వెంబడించిన గ్రామస్తులు... చివరికి...

గయ: పైన కనిపిస్తున్న దృశ్యం ఏ సినిమాలోదో, లేదా ఏదో సీరియల్‌కు సంబంధించినదో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ దృశ్యం బీహార్‌లోని గయ జిల్లాలోని ఒక ప్రేమ జంటకు సంబంధించినది. వీరు సినీ స్టయిల్‌లో బుల్లెట్‌పైనెక్కి రోడ్లపై హొయలొలికిస్తూ తిరగసాగారు. ఈ జంటను చూసిన గ్రామస్తులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే.. వారి బుల్లెట్ ఆపి, వారిద్దిరినీ కొట్టి, వారి చిరునామా తెలుసుకున్నారు. దీంతో  అంతవరకూ హుషారుగా రోడ్లపై తిరిగిన ఆ జంట బిక్కచచ్చిపోయి... ‘సారీ అంకుల్... ఇక ముందెప్పుడూ ఇలా చేయం’ అని ప్రాధేయపడ్డారు. 


ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బుల్లెట్ ట్యాంక్‌పై తన ప్రియురాలిని కూర్చోబెట్టుకుని, ఆ యువకుడు వాహనం వేగంగా నడుపుతున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. అయితే ప్రేమికుల బుల్లెట్‌ను గమనించిన గ్రామస్తులు వారిని ఆటోలో వెంబడించిమరీ పట్టుకుని వారికి బుద్ధి చెప్పారు. కాగా ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లు గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ తెలిపారు.

                                    Today Bihar News సౌజన్యంతో....

Updated Date - 2021-08-03T17:18:42+05:30 IST