Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 17 2021 @ 09:27AM

Rajasthan: పాక్ ఐఎస్ఐకి భారత ఆర్మీ చిత్రాలు లీక్

ఎల్పీజీ గ్యాస్ డీలర్ అరెస్ట్

జైపూర్ : భారత సైన్యం గురించి సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి లీక్ చేసినందుకు ఎల్పీజీ పంపిణీదారుడిని అరెస్టు చేసిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో జరిగింది. రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాకు చెందిన సందీప్ కుమార్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ డీలరుగా పనిచేస్తున్నాడు. సందీప్ ననహర్ లోని ఆర్మీ క్యాంపునకు ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేసే వాడు. అప్పుడు భారత సైన్యానికి చెందిన వ్యూహాత్మక సమాచారం, ఛాయాచిత్రాలను పాక్ ఐఎస్ఐకు లీక్ చేశాడు.

రాజస్థాన్ పోలీసు నిఘా విభాగం, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో గూఢచర్యం ఆరోపణలపై 30 ఏళ్ల సందీప్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసింది.డబ్బు కోసం నరహర్ ఆర్మీబేస్ కు చెందిన సున్నిత సమాచారం, ఛాయాచిత్రాలను లీక్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణ కోసం నిందితుడిని సెప్టెంబర్ 12 న అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ (ఇంటెలిజెన్స్) ఉమేష్ మిశ్రా తెలిపారు.అధికారిక రహస్యాల చట్టం 1923 కింద నిందితుడు సందీప్ పై కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement