ఆ పెంట్‌హౌస్‌ను రూ. 420 కోట్లకు అమ్మేశారు!

ABN , First Publish Date - 2021-02-19T00:08:58+05:30 IST

ఈ వార్త చదివాక మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. హాంకాంగ్‌లో ఐదు బెడ్‌రూములు కలిగిన ఓ పెంట్‌హౌస్

ఆ పెంట్‌హౌస్‌ను రూ. 420 కోట్లకు అమ్మేశారు!

హాంకాంగ్: ఈ వార్త చదివాక మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. హాంకాంగ్‌లో ఐదు బెడ్‌రూములు కలిగిన ఓ పెంట్‌హౌస్ రికార్డు స్థాయిలో ఏకంగా 59 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో దాదాపు రూ. 420 కోట్లకు అమ్ముడుపోయింది. ఆసియాలో ఓ అపార్ట్‌మెంట్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. హాంకాంగ్ టైకూన్ విక్టర్ లి’స్ సీకే అస్సెట్ హోల్డింగ్స్‌కు చెందిన విలాసవంతమైన ఈ పెంట్‌హౌస్.. 21 బారెట్ రోడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడీ ఫ్లాట్‌లో చదరపు అడుగు రికార్డు స్థాయిలో 17,500 డాలర్లకు అమ్ముడైంది. 


21 బారెట్ రోడ్ ప్రాజెక్టులోని 23వ అంతస్తులో ఉన్న ఈ పెంట్‌హౌస్ మొత్తం విస్తీర్ణం 3,378 చదరపు అడుగులు. విలాసవంతమైన సౌకర్యాలతో ఇందులో ఐదు బెట్‌రూములు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ టెర్రస్, మూడు పార్కింగ్ స్థలాలు తదితరాలు ఉన్న ఈ పెంట్‌హౌస్‌ను ఓ వ్యక్తి భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. అతడి పేరును రహస్యంగా ఉంచారు. హాంకాంగ్‌లోని మౌంట్ నికోల్సన్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్ 2017లో భారీ ధరకు అమ్ముడుపోగా, ఇప్పుడా రికార్డును ఇది బద్దలుగొట్టింది.

Updated Date - 2021-02-19T00:08:58+05:30 IST