Madhya Pradesh: వరద సహాయపనుల కోసం టాస్క్ ఫోర్స్

ABN , First Publish Date - 2021-08-09T18:11:06+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరద సహాయక పనుల పర్యవేక్షణకు 12మంది కేబినెట్ ర్యాంకు మంత్రులతో ప్రత్యేకంగా...

Madhya Pradesh: వరద సహాయపనుల కోసం టాస్క్ ఫోర్స్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరద సహాయక పనుల పర్యవేక్షణకు 12మంది కేబినెట్ ర్యాంకు మంత్రులతో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఆ రాష్ట్ర ము్ఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేశారు.వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు. ఛంబల్, గ్వాలియర్ ప్రాంతాల్లో వరద విపత్తు వల్ల 24 మంది మరణించగా, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టుప్రాంతాల్లోని 32,900 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వరద బాధితులకు అదనంగా 50 కిలోల బియ్యం, సరకులను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 


వరద బాధితులకు ఆహారం అందజేయాలని సీఎం సూచించారు.ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.6వేలు ఇవ్వాలని సీఎం కోరారు.పశువులు మరణిస్తే రూ.30వేలు ఇవ్వాలని కోరారు. పంటలు దెబ్బతిన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎ శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. కాగా వరదబాధితులకు సహాయం అందించడంలో మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారు విఫలమైందని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆరోపించారు.


Updated Date - 2021-08-09T18:11:06+05:30 IST