Advertisement
Advertisement
Abn logo
Advertisement

Mahbubnagar: జూరాలకు భారీగా వరద..13 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 13 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా కూడా దిగువకు నీటిని  విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలలో పూర్తిస్థాయిలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 318.089 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 8.770 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్ ఫ్లో 1,05,000క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 89,814 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం వైపు మొత్తం 88,051 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Advertisement
Advertisement