Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొడుకును బయటకు పంపించి.. ప్రియుడిని ఇంటికి రప్పించి ఓ తల్లి చేసిన పాడు పని ఇది.. 17 ఏళ్ల కూతురితో..

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కసాయిగా మారింది.. అభం శుభం తెలియని తన కూతుర్ని ప్రియుడికి అప్పగించింది.. ఆ బాలిక ఒప్పుకోకపోతే నచ్చ చెప్పింది.. ప్రియుడి చేత పలుమార్లు అత్యాచారం చేయించింది.. బాలిక చైల్డ్ హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


ఔరంగాబాద్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ తన భర్త నుంచి విడిపోయి కూతురు, కొడుకుతో కలిసి జీవిస్తోంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత 52 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు తరచుగా వీరి ఇంటికి వస్తుండేవాడు. గతేడాది ఆగస్టు నెలలో కూడా అతను ఆ ఇంటికి వచ్చి ఆ మహిళతో మాట్లాడాడు. అదే రోజు ఇద్దరూ కలిసి కొడుకును బంధువుల ఇంటికి పంపించారు. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో ఉన్న 17 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. పైగా అతనికి అనుకూలంగా నడుచుకోమని చెప్పింది. దీంతో బాలికపై అతడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 


భయపడిన బాలిక ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఎక్కడా ఆశ్రయం దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న బాలికకు ఓ యువకుడితో తల్లి పెళ్లి నిశ్చయించింది. తాము చేసిన అఘాయిత్యాన్ని పూర్తిగా కప్పేద్దామనుకుంది. కాగా, బాలిక చైల్డ్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిని, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement