మహబూబ్‌నగర్‌లో కొవిడ్ టీకాను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2021-01-16T17:37:58+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు.
మహబూబ్‌నగర్: జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుడు కృష్ణ అనే వ్యక్తికి మొదటి టీకా వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... కరోనా ప్రపంచాన్ని వణికించిందని... చాలా మంది డాక్టర్లు కూడా చనిపోయారన్నారు. ప్రముఖులు చనిపోయినా పట్టుమని పది మంది కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు. అప్పట్లో.. బీదా ధనిక అన్న తేడా లేకుండా పరిస్థితి ఉండిందని తెలిపారు. ప్రపంచంలో అదే భావన చిరస్థాయిగా ఉంటే చాలా బాగుంటుందని మంత్రి అన్నారు. ఇవాళ టీకా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆరు వందల కోట్ల జనాభా ఉంటే.. అందులో రెండు వందల యాభై కోట్ల మందికి మన తెలంగాణా నుంచే తయారు కావడం చాలా గర్వాంగా ఉందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనడంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు అభినందనీయులన్నారు. కరోనా బారిన పడ్డా.. వెనకడుగు వేయకుండా పని చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.