Advertisement
Advertisement
Abn logo
Advertisement

కంటతడి పెట్టుకున్న హీరో మహేష్‌బాబు

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని హీరో మహేష్ బాబు సందర్శించి నివాళులర్పిస్తూ కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీతారామశాస్త్రి లేకుండా సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయో ఆలోచించడానికే చాలా కష్టంగా ఉందన్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ... ఆయన కుటుంబసభ్యులకు మహేష్ బాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ఇంకా.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీయార్, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్‌, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్ తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు. ఇక రాజమౌళి, కీరవాణి, మణిశర్మ, గుణశేఖర్, క్రిష్ జాగర్లమూడి, మారుతి, పరుచూరి గోపాలకృష్ణ, ఆచంట గోపీనాథ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కే అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, రావు రమేష్, నిర్మాతలు అల్లు అరవింద్, ప్రసాద్, కేఎల్ నారాయణ, చోటా కే నాయుడు, సింగర్ సునీత తదితరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించారు.

Advertisement
Advertisement