అప్పులు చేసుకోండి

ABN , First Publish Date - 2020-09-25T07:23:23+05:30 IST

ఓపెన్‌ మార్కెట్‌ రుణాల (ఆఫీస్‌ ఆన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌-ఓఎంబీ) రూపంలో రూ. 9,913 కోట్ల మేర అప్పులు చేసుకునేలా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది...

అప్పులు చేసుకోండి

  • తెలంగాణకు రూ. 2,508 కోట్ల పరిమితి
  • అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మేం ప్రకటించిన పథకాలను అమలు చేయండి.. అప్పులు చేసుకోండి.. అందుకు అనుమతులు ఇస్తాం’’ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన ఐదు రాష్ట్రాలకు.. ఓపెన్‌ మార్కెట్‌ రుణాల (ఆఫీస్‌ ఆన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌-ఓఎంబీ) రూపంలో రూ. 9,913 కోట్ల మేర అప్పులు చేసుకునేలా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. కేంద్రం అప్పులకు అనుమతినిచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ (రూ. 2,508 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ. 2,525 కోట్లు), కర్ణాటక (రూ. 4,509 కోట్లు), గోవా (రూ. 223 కోట్లు), త్రిపుర (రూ. 148 కోట్లు) ఉన్నాయి. 2020-21 సంవత్సరానికి గాను.. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ)లో 2ు మేరకు రాష్ట్రాలకు అదనపు రుణపరిమితిని పెంచుతూ ఈ ఏడాది మే నెలలో కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రాష్ట్రాలకు రూ. 4,27,302 కోట్ల మేర అదనపు రుణసౌకర్యం కలుగుతుంది. ఇందులో ఒక శాతాన్ని నాలుగు నిర్దిష్టమైన రాష్ట్రస్థాయి సంస్కరణలకు లోబడి అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. వాటిల్లో.. ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’, సులభతర వ్యాపార సంస్కరణలు, పట్టణ - స్థానిక వినియోగ సంస్కరణలు, విద్యుత్తు రంగ సంస్కరణలు ఉన్నాయి. ఈ ఒక్క శాతంలో.. 0.25ు మేరకు ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’ పథకాన్ని అమలు చేసినందుకు ఐదు రాష్ట్రాలకు అనుమతిని ఇచ్చింది.

Updated Date - 2020-09-25T07:23:23+05:30 IST