విద్యార్థులు హాజరయ్యేలా చూడాలి

ABN , First Publish Date - 2020-06-02T10:35:27+05:30 IST

ఈ నెల 8 నుంచి నిర్వహించనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులందరు హాజరయ్యేలా చూడాలని ఇందుకు సంబంధిత

విద్యార్థులు హాజరయ్యేలా చూడాలి

కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి:  డీఈవో రవీందర్‌రెడ్డి


ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌1: ఈ నెల 8 నుంచి నిర్వహించనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులందరు హాజరయ్యేలా చూడాలని ఇందుకు సంబంధిత ఉపాధ్యాయులదే బాధ్యత అని జిల్లా విద్యాశాఖాధికారి రవీంద ర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల ఆవరణలో సీఎస్‌, డీవోలు, అడిషనల్‌ డీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో 12 మందిని జిగ్‌జాగ్‌ మ్యానర్‌లో కూర్చోబెట్టాలన్నారు. అలాగే ప్రతీ విద్యార్థికి మాస్కు, శానిటైజర్‌ అందించాలని సూచించారు. దగ్గు, జలుబు, జ్వరంతో ఉంటే వారికి ప్రత్యేక గదిని కేటాయించి పరీక్ష రాయించాలన్నారు. 10,818 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వారి కోసం జిల్లా వ్యాప్తంగా 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.


వీవీలను రెన్యూవల్‌ చేయాలని డీఈవోకు వినతి..

జిల్లాలోని ఆయా పాఠశాలలో పని చేస్తున్న విద్యా వలంటీర్లను ఈ యేడాది రెన్యూవల్‌ చేయాలని కోరుతూ సోమవారం తెలంగాణ విద్యా వలంటీర్ల ఆధ్వర్యంలో డీఈవోను కలిసి వినతి పత్రం అందించారు.

Updated Date - 2020-06-02T10:35:27+05:30 IST