Abn logo
Sep 6 2021 @ 00:00AM

తాబేలు బొమ్మ!

కావలసినవి

ఎగ్‌ కార్టన్‌, గ్రీన్‌ కార్డ్‌బోర్డ్‌, పామ్‌పామ్స్‌, గూగ్లీ కళ్లు, గ్రీన్‌ పెయింట్‌, బ్రష్‌, జిగురు.


ఇలా చేయాలి...

  1. ఎగ్‌కార్టన్‌లో నుంచి ఎగ్‌ బాక్స్‌లను సపరేట్‌గా కట్‌ చేసుకోవాలి. తరువాత బ్రష్‌ సహాయంతో ఎగ్‌ బాక్స్‌కు గ్రీన్‌ పెయింట్‌ వేయాలి. 
  2. గ్రీన్‌ కార్డ్‌బోర్డ్‌ను తీసుకుని తాబేలు కాళ్లు, చేతులు, తోక వచ్చేలా లైన్‌ గీసి, బొమ్మలో చూపించిన విధంగా కత్తిరించుకోవాలి. తరువాత జిగురు సహాయంతో ఎగ్‌బాక్స్‌కు అతికించాలి.
  3. ఇప్పుడు పామ్‌పామ్‌ను ముందు భాగంలో అంటించాలి. చివరగా గూగ్లీ కళ్లు అతికిస్తే తాబేలు బొమ్మ రెడీ.