గుమ్మడికాయ గింజలతో ఆర్ట్‌!

ABN , First Publish Date - 2020-05-22T05:30:00+05:30 IST

మీరు బొమ్మలు బాగా గీయగలరా? అయితే బొమ్మ గీసి వాటికి గుమ్మడికాయ గింజలతో ఆర్ట్‌ వర్క్‌ను జతచేయండి. తరువాత మీ స్నేహితులకు షేర్‌ చేయండి. ఇది ఎలా చేయాలంటే...

గుమ్మడికాయ గింజలతో ఆర్ట్‌!

మీరు బొమ్మలు బాగా గీయగలరా? అయితే బొమ్మ గీసి వాటికి గుమ్మడికాయ గింజలతో ఆర్ట్‌ వర్క్‌ను జతచేయండి. తరువాత మీ స్నేహితులకు షేర్‌ చేయండి. ఇది ఎలా చేయాలంటే...


కావలసినవి

  1. గుమ్మడికాయ గింజలు 
  2. వాక్స్‌ పేపర్లు
  3. ఎక్రిలిక్‌ పెయింట్స్‌
  4. పెన్సిల్‌
  5. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌
  6. జిగురు
  7. రంగుల డ్రాయింగ్‌ పేపర్లు 


ఇలా చేయాలి...

  1. ప్యాస్టిక్‌ బ్యాగుల్లో రకరకాల రంగుల ఎక్రిలిక్‌ పెయింట్‌ వేయాలి. 
  2. వాటిలో గుమ్మడికాయ గింజలు వేసి బ్యాగులు బాగా షేక్‌ చేయాలి.
  3. గింజలకు రంగు బాగా పట్టేలా చూడాలి. 
  4. గింజలకు రంగు సరిగ్గా అంటుకున్నాక వాక్స్‌ పేపర్స్‌పై వేసి ఆరబెట్టాలి.
  5. ఇప్పుడు డ్రాయింగ్‌ పేపర్‌ తీసుకుని చెట్టు బొమ్మ గీయాలి. రకరకాల పూల బొమ్మలు గీయవచ్చు.
  6. డ్రాయింగ్‌ పూర్తయ్యాక జిగురుతో గింజలను అతికించాలి. గింజలు ఎక్కడ అతికిస్తే అందంగా కనిపిస్తుందో చూసుకుని అతికించాలి. అంతే... మీరు ఆర్ట్‌ వర్క్‌ పూర్తయినట్టే!

Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST