మలేషియాలో ఘోర రైలు ప్రమాదం...213మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-05-25T15:05:20+05:30 IST

మలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలోని సొరంగంలో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 213 మంది గాయపడ్డారు....

మలేషియాలో ఘోర రైలు ప్రమాదం...213మందికి గాయాలు

కౌలాలంపూర్ (మలేషియా): మలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలోని సొరంగంలో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 213 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన 23 ఏళ్ల మలేషియా మెట్రోరైలు చరిత్రలో మొదటిది. తీవ్రంగా గాయపడిన 47 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు గాజు ముక్కలు తగిలి రక్తం స్రవించింది. ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ చెప్పారు. 


మెట్రోరైలు ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాన మంత్రి మొహిద్దీన్ యాసీన్ దర్యాప్తునకు ఆదేశించారు. రైళ్ల ఆపరేషన్ కంట్రోల్ సెంటరులో తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం మెట్రోరైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. రైలు ప్రమాదం జరిగినపుడు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఎగిరి కింద పడ్డారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

Updated Date - 2021-05-25T15:05:20+05:30 IST