Abn logo
Dec 4 2020 @ 15:37PM

రైతులతో ఫోనులో మాట్లాడిన మమతాబెనర్జీ

కోల్‌కతా: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘీభావం తెలిపారు. 2006లో వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌లో తాను చేసిన 26 రోజుల నిరాహార దీక్షను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

'వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడానికి వ్యతిరేకంగా సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 డిసెంబర్ 4న నేను 26 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించాను. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నాను' అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. రైతులకు అండగా ఉంటాం...అనే య్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.

కాగా, సంఘు సరిహద్దు (ఢిల్లీ-హర్యానా సరిహద్దు) వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ శుక్రవారంనాడు కలుసుకున్నారు. మమతా బెనర్జీకి ఫోను చేసిన ఆందోళన చేస్తున్న రైతు నేతలతో ఒబ్రెయిన్ మాట్లాడించారు.

Advertisement
Advertisement
Advertisement