పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై.. నెట్టింట మీమ్స్ వెల్లువ
ABN , First Publish Date - 2021-05-02T19:13:50+05:30 IST
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. బెంగాల్ టీఎంసీ కంచుకోటలో పాగా వేయాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. టీఎంసీ కీలక నాయకులను తనపైపు తిప్పుకుని ఆ పార్టీని దెబ్బకొట్టాలని చూసింది. ఈ క్రమంలోనే మమతకు సన్నిహితుడైన మాజీ మంత్రి సువేందు అధికారిని బీజేపీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దింపింది. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు మమతపై పలు విమర్శలు చేశారు. వీటన్నింటినీ తట్టుకుని మమత ఇప్పుడు విజయానికి చేరువవుతున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో మమతకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ బెబ్బులి అని కొందరు మమతను కొనియాడుతుండగా మరికొందరు ఆమెను దుర్గామాత ప్రతిరూపంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం 200 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ దూసుకుపోతోంది. దీంతో మమతపై సోషల్ మీడియాలో అభినందనల మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.