గ్రామాల్లో నిరాడంబరంగా బోనాల పండుగ

ABN , First Publish Date - 2020-08-11T10:40:02+05:30 IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకైన బోనాల పండుగను కడ్తాల మండల కేంద్రంలో ప్రజలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

గ్రామాల్లో నిరాడంబరంగా బోనాల పండుగ

భక్తిశ్రద్ధలతో మొక్కలు చెల్లించుకున్న భక్తులు 

మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ 

గ్రామ దేవతలకు నేవేద్యాలు సమర్పించిన మహిళలు 


కడ్తాల్‌/తలకొండపల్లి/యాచారం/కందుకూరు/కొందుర్గు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకైన బోనాల పండుగను కడ్తాల మండల కేంద్రంలో ప్రజలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో  జరుపుకున్నారు. పోచమ్మ బోనాల సందర్భంగా గ్రామ దేవతల ఆలయాలను పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. కరోనా నేపథ్యంలో బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఉదయం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.


సాయంత్రం మహిళలు బోనమెత్తి ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మినర్సింహారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌  వెంకటేశ్‌, ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ, కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, సింగిల్‌విండో డైరెక్టర్‌ వెంకటేశ్‌, నాయకులు నరేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టిప్పలపల్లిలో జగత్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా పునఃర్మించిన పోచమ్మ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ జయమ్మ వెంకటయ్య, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శశివర్ధన్‌రెడ్డి, శరత్‌చంద్రశర్మ, మల్లేశ్‌, విజేందర్‌ పాల్గొన్నారు.


అదేవిధంగా యాచారం మండలంలోని మొగ్గుళ్లవంపు, కందుకూరు మండలంలోని బాచుపల్లిలో మహిళలు బోనమెత్తి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించారు. కొందుర్గు మండలంలోని మాలకుంట్ల మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రానికి చెందిన పలువురు మహిళలు మైసమ్మ ఆలయానికి బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌, నాయకులు ప్రవీణ్‌, శేఖర్‌, గౌరీశంకర్‌, రవి, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:40:02+05:30 IST