Bengal : దుమ్ము దుమారం రేపుతున్న ‘మమత విగ్రహం’

ABN , First Publish Date - 2021-09-04T00:25:19+05:30 IST

దుర్గా నవరాత్రులకు బెంగాల్ సిద్ధమవుతోంది. అయితే మండపంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని

Bengal : దుమ్ము దుమారం రేపుతున్న ‘మమత విగ్రహం’

కోల్‌కతా : దుర్గా నవరాత్రులకు బెంగాల్ సిద్ధమవుతోంది. అయితే మండపంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొందరు నిర్ణయించారు. పది చేతులతో ఉన్న మమత విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధమైపోయారు. దుర్గాదేవి విగ్రహంతో పాటు మమత విగ్రహం కూడా ఉంటుంది. ఈ పది చేతుల్లో వివిధ రకాలైన ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను ఉంచనున్నారు. మరోవైపు ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రతిపక్ష బీజేపీ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని నందిగ్రామ్ ఎమ్మెల్యే సుబేందు అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతను సంతోషపెట్టడానికి ఇలా చేస్తారా? అంటూ మండిపడ్డారు. తృణమూల్ అహంకారం నెత్తికెక్కిందని సుబేందు తీవ్రంగా ధ్వజమెత్తారు. 


అయితే ఈ విగ్రహం రూపశిల్పి మింట్ పాల్ స్పందించాడు. ‘‘నా టీమ్‌తో కలిసి పది చేతులతో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాన్ని తయారుచేస్తున్నాను. దుర్గాదేవి మండపంలోనే ఈ విగ్రహాన్ని ఉంచుతాం. అయితే ఈ విగ్రహానికి పూజలు మాత్రం చేయం. కేవలం ప్రజల దర్శనార్థం ఉంచుతాం.’’ అని మింట్ పాల్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-04T00:25:19+05:30 IST