కుక్కను కొట్టిన వ్యక్తి అరెస్టుకు మనేకాగాంధీ డిమాండ్... పోలీసులకు ఫోన్ కాల్

ABN , First Publish Date - 2021-06-22T12:51:42+05:30 IST

కుక్కను కర్రతో కొట్టి కాలు విరగగొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మనేకాగాంధీ పోలీసులను కోరిన ఘటన...

కుక్కను కొట్టిన వ్యక్తి అరెస్టుకు మనేకాగాంధీ డిమాండ్... పోలీసులకు ఫోన్ కాల్

న్యూఢిల్లీ : కుక్కను కర్రతో కొట్టి కాలు విరగగొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మనేకాగాంధీ పోలీసులను కోరిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్వాలి సీతాపూర్ పట్టణంలో వెలుగుచూసింది. కుక్క కాలును విరగగొట్టిన వ్యక్తికి చెంపదెబ్బ కొట్టాలని, గాయపడిన కుక్క చికిత్సకు అయ్యే ఖర్చును అతని నుంచి వసూలు చేయాలని మనేకాగాంధీ కొత్వాలి సీతాపూర్ పోలీసు అధికారిని కోరింది. గ్వాల్ మండీ ప్రాంతానికి చెందిన రమేష్ వర్మ కర్రతో కుక్క కాలు విరగగొట్టాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మనేకాగాంధీ కోరారని పోలీసు అధికారి టీపీసింగ్ చెప్పారు. 


కుక్కను హింసించిన ఘటనపై జంతు హక్కుల కార్యకర్త మేరాజ్ అహ్మద్ ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు.దీంతో మనేకాగాంధీ ఫోన్ చేయడంతో  పోలీసుల్లో కదలిక వచ్చింది. గాయపడిన కుక్కను పశువుల ఆసుపత్రిలో చేర్చి  చికిత్స చేపిస్తున్నామని, కుక్కను కొట్టిన నిందితుడు రమేష్ వర్మను అరెస్టు చేసి, అతనిపై జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-06-22T12:51:42+05:30 IST