కరోనా లేదంటూ నకిలీ రిపోర్ట్.. వైరస్‌తో వ్యక్తి మృతి!

ABN , First Publish Date - 2020-08-02T04:16:36+05:30 IST

కరోనా పరీక్ష చేయించుకున్న ఓ వ్యక్తికి నెగిటివ్ ఫలితం వచ్చింది.

కరోనా లేదంటూ నకిలీ రిపోర్ట్.. వైరస్‌తో వ్యక్తి మృతి!

కోల్‌కతా: కరోనా పరీక్ష చేయించుకున్న ఓ వ్యక్తికి నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో తాను సురక్షితంగానే ఉన్నానని అతను అనుకున్నాడు. అయితే ఈ పరీక్ష చేసిన కొన్ని రోజులకే అతను కరోనాతో మరణించాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. స్థానికంగా ఉన్న బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ 57ఏళ్ల వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. దీని ఫలితం నెగిటివ్ అంటూ రిపోర్టుతోపాటు వాట్సాప్ మెసేజి కూడా వచ్చింది. దీంతో సంతృప్తి చెందిన అతను తన రోజువారీ జీవితంలో మునిగిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మృతి చెందిన అతను కరోనాతోనే చనిపోయినట్లు తేలింది. దీంతో అతనికి పంపిన రిపోర్టు నకిలీదని, అతన్ని ఎవరో మోసం చేశారని వెల్లడయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాట్సాప్ మెసేజి వచ్చిన నంబరు సాయంతో నిందితుడిని ట్రేస్ చేశారు.

Updated Date - 2020-08-02T04:16:36+05:30 IST