కరోనా భయంతో కిరోసిన్ తాగాడు.. తీరా చనిపోయాక..

ABN , First Publish Date - 2021-05-19T00:10:39+05:30 IST

కరోనా దెబ్బకు ప్రజల ఆలోచనా శక్తి కూడా క్షిణించిపోతోంది. ఏది మంచో ఏది చెడో కూడా తెలియని స్థితిలోకి కొందరు చేరుతున్నారు. ఈ మహమ్మారి బారి నుంచి..

కరోనా భయంతో కిరోసిన్ తాగాడు.. తీరా చనిపోయాక..

భోపాల్: కరోనా దెబ్బకు ప్రజల ఆలోచనా శక్తి కూడా క్షిణించిపోతోంది. ఏది మంచో ఏది చెడో కూడా తెలియని స్థితిలోకి కొందరు చేరుతున్నారు. ఈ మహమ్మారి బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మరికొందరు ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి కూడా ఇలానే చేశాడు. అనుకోకుండా జ్వరం రావడంతో కరోనా అని భయపడని ఆ వ్యక్తి ఎలాగైనా దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో కరోనాను కిరోసిన్ చంపేస్తుందని తెలిసిన వ్యక్తి అతడికి చెప్పాడు. దీంతో తనకు సోకిన కరోనాను చంపాలన్నా కిరోసిన్ ఒక్కటే మార్గమని ఏకంగా కిరోసిన్ తాగేశాడు. దీంతో  అతడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మరణించిన తరువాత కరోనా పరీక్ష నిర్వహించగా.. టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. అతడి డెడ్ బాడీ నుంచి శాంపిల్స్ తీసుకుని పరిశీలించగా అతడికి అసలు కరోనా సోకలేదని రిపోర్టుల్లో తేలింది. అతడికి వచ్చింది సాధారణ జ్వరమేనని, కానీ భయంతో కిరోసిన్ తాగేశాడని, దానివల్లే అతడి మరణం సంభవించిందని పోలీసుల కథనం.

Updated Date - 2021-05-19T00:10:39+05:30 IST