టిక్‌టాక్‌తో పరిచయం.. సహజీవనం.. రెండ్రోజుల నుంచి అతడి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో..

ABN , First Publish Date - 2020-07-02T15:29:45+05:30 IST

టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి సహజీవనం చేశాడు. చెప్పకుండా పారిపోయాడు. నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

టిక్‌టాక్‌తో పరిచయం.. సహజీవనం.. రెండ్రోజుల నుంచి అతడి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో..

బంజారాహిల్స్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి సహజీవనం చేశాడు. చెప్పకుండా పారిపోయాడు. నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. టిక్‌టాక్‌ ద్వారా బి. వినయ్‌ అనే వ్యక్తి ఆమెకు గత ఏడాది పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించడంతో సహజీవనం ప్రారంభించారు. రెండు రోజుల నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తుంది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డబ్బు రూ. 1.50 లక్షలు వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-02T15:29:45+05:30 IST