Advertisement
Advertisement
Abn logo
Advertisement

అడక్కుండానే బ్రా పంపించి.. వెన్కక్కి తీసుకోమంటే కుదరద్న మింత్రా.. దాన్ని వేసుకునేందుకు రెడీ అంటూ ఫుట్‌బాల్ ప్లేయర్ పోస్ట్.. చివరికి

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మధ్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి కూడా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. ఏది కొనాలనుకున్న క్షణాల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా తనకు కావాల్సిన సాక్సులను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మింత్రాలో తాజాగా ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత తనకు వచ్చిన పార్శల్‌ను ఓపెన్ చేసి చూసి, అతడు కంగుతిన్నాడు. అనంతరం విషయాన్ని కంపెనీ ప్రతినిధులకు చేరవేశాడు. అయితే వారి నుంచి ఊహించని సమాధానం రావడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అదికాస్తా వైరల్ కావడంతో మింత్రా దిగొచ్చింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. 


కశ్యప్ అనే వ్యక్తికి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఫుట్‌బాల్ ఆడేప్పుడు వేసుకోవడానికి తాజాగా ‘మింత్రా’‌లో ఓ జత సాక్సులను ఆర్డర్ చేశాడు. రోజుల వ్యవధిలోనే ఓ డెలివరీ బాయ్ వచ్చి అతడికి పార్శల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పార్శల్ ఓపెన్ చేసి.. కశ్యప్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. పార్శల్‌లో సాక్సులకు బదులు.. మహిళలు ధరించే ‘బ్రా’ ఉండటంతో అతడు షాకయ్యాడు. అనంతరం ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. ఆర్డర్‌ను రిటర్న్ తీసుకోవాలని కోరాడు. అయితే దానికి వారు అంగీకరించలేదు. దీంతో కశ్యప్ ఆగ్రహానికి లోనయ్యాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాకుండా దాన్ని ధరించే తాను ఫుట్‌బాల్ ఆడబోతున్నట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ‘మింత్రా’ దిగొచ్చింది. కశ్యప్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పడమే కాకుండా.. అతడు పెట్టిన రిక్వెస్ట్‌ మీద పని చేస్తున్నట్టు వెల్లడించింది. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement