మాస్క్‌తో జాగింగ్‌.. ఊపిరితిత్తులు విఫలం

ABN , First Publish Date - 2020-05-24T07:15:37+05:30 IST

కరోనాకు కేంద్రబిందువైన వూహాన్‌లో మాస్క్‌ లేకుండా ఎవరూ బయట అడుగుపెట్టడం లేదు. అయితే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఉదయం జాగింగ్‌ సమయంలో మాస్క్‌ ధరించి పరిగెత్తడం అతడి ప్రాణాల మీదకు...

మాస్క్‌తో జాగింగ్‌.. ఊపిరితిత్తులు విఫలం

వుహాన్‌, మే 23: కరోనాకు కేంద్రబిందువైన వూహాన్‌లో మాస్క్‌ లేకుండా ఎవరూ బయట అడుగుపెట్టడం లేదు. అయితే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఉదయం జాగింగ్‌ సమయంలో మాస్క్‌ ధరించి పరిగెత్తడం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. సుమారు రెండు మైళ్ల దూరం పరిగెత్తడంతో.. ఊపిరిరాడక అపస్మారక స్థితిలోకి చేరాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఊపిరితిత్తులు విఫలమయ్యాయని, సర్జరీ చేశామని వైద్యు లు తెలిపారు. మాస్క్‌ కారణంగా శరీరానికి సరైన స్థాయిలో గాలి అందక ఎడమవైపున ఊపిరితిత్తి పేలి, చిన్నగా అయిపోయిందని.. గుండె కదిలిపోయి కుడివైపునకు వచ్చేసిందని వారు పేర్కొన్నారు.  

Updated Date - 2020-05-24T07:15:37+05:30 IST