Shocking Video: స్టేజ్‌పై శివుడి పాత్ర పోషిస్తూ కుప్పకూలిన నటుడు.. అసలేం జరిగిందో చూడండి..
ABN , First Publish Date - 2022-10-13T00:34:20+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రామ్‌లీలా నాటకం ప్రదర్శిస్తుండగా..
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రామ్‌లీలా నాటకం ప్రదర్శిస్తుండగా.. శివుడి పాత్ర పోషిస్తున్న వ్యక్తి స్టేజ్ మీదే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ నాటకం వేస్తున్నవారు, చూస్తున్న వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బెలాసిస్ గ్రామంలో సోమవారం సాయంత్రం రామ్‌లీలా నాటిక ప్రదర్శన జరుగుతోంది. ఆ నాటకంలో రామ్ ప్రసాద్ పాండే అనే కళాకారుడు శివుడి పాత్ర వేశాడు.
ప్రదర్శన సమయంలో శివుడి గెటప్‌లో ఉన్న రామ్ ప్రసాద్‌కు ఓ వ్యక్తి హారతి ఇస్తున్నాడు. ఆ సమయంలో రామ్ ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. వెంటనే రామ్ ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి ప్రాణాలు పోయాయి. అతడు గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. కాగా, రామ్ ప్రసాద్ గత ఐదేళ్లుగా రామ్‌లీలా నాటక ప్రదర్శనలో పాల్గొంటున్నాడు. ఇప్పటికి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. చివరకు స్టేజ్ మీదే మరణించడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.