వ్యభిచారం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త.. పోలీసులకు పట్టుబడ్డ మహిళ.. అతడి భార్యే అని తెలిసి..
ABN , First Publish Date - 2022-04-04T01:04:38+05:30 IST
బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొందరు కష్టపడి కుటుంబాలను పోషిస్తుంటే.. మరికొందరు తమ తెలివితేటలే పెట్టుబడిగా డబ్బు సంపాదిస్తూ హుందాగా జీవితాన్ని..
బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొందరు కష్టపడి కుటుంబాలను పోషిస్తుంటే.. మరికొందరు తమ తెలివితేటలే పెట్టుబడిగా డబ్బు సంపాదిస్తూ హుందాగా జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఇంకొందరు మాత్రం ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ.. చివరికి జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. బీహార్‌లో ఓ వ్యక్తి.. వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం ఏ భర్త.. కలలో కూడా తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డ మహిళ అతడి భార్యే అని తెలిసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన ధనంజయ్ కుమార్ అనే వ్యక్తి.. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్లు బాగా సాగిన వీరి సంసారంలో ఆర్థిక సమస్యలు వచ్చిపడ్డాయి. డబ్బు సంపాదనకు ఏదో ఒక పని చేయాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. కట్టుకున్న భార్యతో వ్యభిచారం చేయించి, డబ్బు సంపాదించాలని కుట్ర పన్నాడు. ఇదే విషయాన్ని భార్యతో చెప్పగా.. ఆమె అందుకు అసలు ఒప్పుకోలేదు. అయినా బలవంతంగా ఆమెను వ్యభిచార కూపంలోకి దింపాడు. తాము ఉంటున్న ప్లాట్‌లోనే ఎవరికీ అనుమానం రాకుండా రోజూ కొందరిని తమ ఇంటికి పిలిపించుకునేవాడు. బంధువులని చెప్పడంతో స్థానికులకు ఎవరికీ అనుమానం కలగలేదు.
అబ్బాయి అస్సలు బాగాలేడంటూ పెళ్లిని రద్దు చేసుకున్న 18 ఏళ్ల యువతి.. 13 ఏళ్ల క్రితం తండ్రి చేసిన పనికి..
రోజూ ఇద్దరు, ముగ్గురిని చొప్పున పిలిపించి.. భార్యతో వ్యభిచారం చేయించసాగాడు. కొన్నాళ్లకు మరికొందరు మహిళలను తమ ఇంట్లో పెట్టుకుని, వారితో కూడా వ్యభిచారం చేయించసాగాడు. దాదాపు రెండేళ్లుగా ఈ తతంగం నడుస్తున్నా ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఇటీవల స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రైడ్ చేశారు. బాధిత మహిళలందరినీ రక్షించారు. తమకు కొంత మొత్తం ముట్టజెప్పి.. రోజూ నరకం చూపిస్తున్నారని మహిళలు వాపోయారు. చివరికి భార్యను కూడా బలవంతంగా ఈ మురికి కూపంలోకి దించాడని తెలుసుకుని స్థానికులంతా షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.