మనం ఇక బాగుపడమా.. ఇంతేనా..? ఐపీఎస్ షేర్ చేసిన వైరల్ వీడియో

ABN , First Publish Date - 2021-05-02T01:51:48+05:30 IST

మాస్కులు, శానిటైజర్లు.. కరోనాను నిలువరించేందుకు మనకున్న ప్రధాన ఆయుధాలు. కరోనా సంక్షోభం మొదట్లో వీటికి డిమాండ్ పెరిగి కొరత ఏర్పడినప్పటికీ..ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉంది. శానిటైజర్లు ప్రతి షాపులోనూ దొరుకుతున్నాయి. వీటిని దొంగతనం చేయనక్కర్లు. మరి అలవాటో గ్రహపాటో తెలీదు కానీ

మనం ఇక బాగుపడమా.. ఇంతేనా..? ఐపీఎస్ షేర్ చేసిన వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: మాస్కులు, శానిటైజర్లు.. కరోనాను నిలువరించేందుకు మనకున్న ప్రధాన ఆయుధాలు. కరోనా సంక్షోభం మొదట్లో వీటికి డిమాండ్ పెరిగి కొరత ఏర్పడినప్పటికీ..ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉంది. శానిటైజర్లు ప్రతి షాపులోనూ దొరుకుతున్నాయి. వీటిని సమకూర్చుకునేందుకు అడ్డదార్లు తొక్కుతూ దిగజారిపోనక్కర్లేదు. మరి అలవాటో గ్రహపాటో తెలీదు కానీ..ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్‌లొ ఉన్న శానిటైజర్‌ను దొంగిలిస్తూ కెమెరా కంటికి దొరికిపోయాడు. ఈ వీడియోను దిపాన్షూ కాబ్రా అనే ఐపీఎస్ అధికారి ట్వీటర్లో షేర్ చేశారు. ‘‘వీరికి దొంగతనం ఓ వ్యసనంగా మారింది. దేశంలో లక్షల సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. ఇటువంటి వారిని అడ్డుకోవాలంటే ప్రతి ఏటీఎంలో రూ. 200 లేదా 300 పెట్టి శాజిటైజర్ బాటిళ్ల చుట్టూ జాలీలను ఏర్పాటు చేయాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ మీరు పద్ధతిగా నడుచుకుంటే..ఈ డబ్బంతా ఆదా అవుతుంది. ఇది మీకూ శ్రేయస్కరమే’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి జతగా.. ‘మనం ఇక బాగుపడం’ అనే అర్థం వచ్చే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా పెట్టారు.  ఇది నెటిజన్ల కంట పడటం ఆలస్యం.. తెగ వైరల్ అయిపోయింది. ‘‘ఏంటి..దీన్ని కూడా వదలరా..మనం ఇక బాగుపడం’’ అంటూ నెటిజన్లు ఐపీఎస్ అభిప్రాయాంతో ఏకీభవించారు.



Updated Date - 2021-05-02T01:51:48+05:30 IST