అమ్మాయిల లో దుస్తులు చోరీ చేస్తూ సీసీ కెమెరాలో దొరికిపోయిన కుర్రాడు.. అతడి ఇంట్లో పోలీసులు సెర్చ్ చేస్తే..

ABN , First Publish Date - 2021-09-08T18:02:31+05:30 IST

కాయిన్ వేసి దుస్తులు ఉతుక్కునే లాండ్రెట్‌లోకి వచ్చాడా వ్యక్తి. ఎవరూ లేరని నిర్ధారించుకొని అక్కడ ఉన్న దుస్తుల్లో నుంచి మహిళల లోదుస్తులు తీసుకొని ఉడాయించాడు.

అమ్మాయిల లో దుస్తులు చోరీ చేస్తూ సీసీ కెమెరాలో దొరికిపోయిన కుర్రాడు.. అతడి ఇంట్లో పోలీసులు సెర్చ్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కాయిన్ వేసి దుస్తులు ఉతుక్కునే లాండ్రెట్‌లోకి వచ్చాడా వ్యక్తి. ఎవరూ లేరని నిర్ధారించుకొని అక్కడ ఉన్న దుస్తుల్లో నుంచి మహిళల లోదుస్తులు తీసుకొని ఉడాయించాడు. ఇలా ఆరు జతల మహిళల లోదుస్తులు తీసుకుంటూ అతను కెమెరాకు చిక్కాడు. అతని పేరు టెత్సువో ఉరాటా. 54ఏళ్ల ఉరాటా ఇలా కెమెరాకు చిక్కడంతో అతని ఇంటిపై పోలీసులు రెయిడ్ చేశారు. అక్కడే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులే ఆశ్చర్యపోయే సంఖ్యలో ఉరాటా వద్ద మహిళల లోదుస్తులు కనిపించాయి. 


జపాన్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చాలా ఏళ్లుగా ఉరాటా ఇలా మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నట్లు తెలుస్తోంది. అతని ఇంటిపై రెయిడ్ చేసిన పోలీసులకు 730 జతల లోదుస్తులు దొరికాయి. వీటన్నింటినీ నేలపై ఉంచి ఫొటో తీసిన పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాము ఇంత భారీ సంఖ్యలో మహిళల లోదుస్తులను ఇటీవలి కాలంలో ఎప్పుడూ స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-08T18:02:31+05:30 IST