Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 20 2021 @ 22:51PM

కొడుకు పుట్టలేదని భార్యపై వేడి నూనె పోసిన భర్త

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగిపోయింది. కొడుకు పుట్టలేదని భర్త అతి దారుణానికి పాల్పడ్డాడు. తనకు కొడుకు పుట్టలేదని తన భర్త తనపై వేడి నూనె పోశాడని 26 ఏళ్ల మహిళ తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారని పోలీసులు చెప్పారు. తమకు కొడుకు పుట్టకపోవడం తన తప్పుగా భావించి తన భర్త తనను అప్పుడప్పుడూ కొట్టేవాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

Advertisement
Advertisement