కోవిడ్-19 సహాయక చర్యలకు మాండెలెజ్ ఇండియా మద్దతు

ABN , First Publish Date - 2021-08-03T07:14:42+05:30 IST

దేశవ్యాప్తంగా కోవిడ్ సహాయక చర్యలలో భాగంగా, మోండెలెజ్ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 91 ఆక్సిజన్..

కోవిడ్-19 సహాయక చర్యలకు మాండెలెజ్ ఇండియా మద్దతు

అమరావతి: దేశవ్యాప్తంగా కోవిడ్ సహాయక చర్యలలో భాగంగా, మోండెలెజ్ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 91 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేసింది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ ప్రభుత్వ పరిశ్రమల డైరెక్టర్ జేవీఎన్ సుబ్రమణ్యం సమక్షంలో ఈ కాన్‌సన్ట్రేటర్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ చిత్తూరు శ్రీ హరి నారాయణస్వామి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్  కమిషనర్ పీఎస్ గిరీశ్ వంటి ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.


దీనిపై కంపెనీ ప్రతినిథులు మాట్లాడుతూ.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతి పెద్ద ఉత్పాదక సదుపాయాన్ని మోండెలెజ్ ఇండియా కంపెనీ చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీ వద్ద కలిగిఉందని చెప్పారు. అలాగే కంపెనీ అనేక సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రానికి వైద్య పరికరాలను అందించడంతో పాటు, శ్రీసిటీ ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, వారిపై ఆధారపడి ఉన్న వారికి కోవిడ్ టీకాలు వేయించుకుంనేందుక అవసరమైన సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.

Updated Date - 2021-08-03T07:14:42+05:30 IST