Advertisement
Advertisement
Abn logo
Advertisement

సినీఫక్కీలో దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

మంగళూరు: దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్లను టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో మనం చూస్తుంటాం...అలాగే మంగళూరు నగరంలో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్న ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళూరులోని నెహ్రూ మైదాన్ వీధుల్లో గురువారం మధ్యాహ్నం మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన దొంగను ఓ ఎస్ఐ వెంబడించడం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఆర్‌ఎస్‌ఐ) వరుణ్ అల్వా నీర్‌మార్గ్‌కు చెందిన 32 ఏళ్ల హరీష్ పూజారి అనే దొంగని సినిమా స్టైల్‌లో వెంబడించి పట్టుకున్నాడు. వీడియోలో పోలీసు దొంగని వెంబడిస్తూ ఇరుకైన గల్లీల గుండా వెళ్లడం కనిపించింది, చివరకు దొంగను  పట్టుకోగలిగాడు. 

రద్దీగా ఉండే రహదారి మధ్యలో పోలీసు దొంగను పట్టుకున్నాడు.అంతకుముందు నెహ్రూ మైదాన్ సమీపంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని వెంబడించడాన్ని పోలీసులు గమనించారు. రాజస్థాన్‌కు చెందిన గ్రానైట్ కార్మికుడు ప్రేమ్ నారాయణ్ యోగి అనే బాధితుడి నుంచి ముగ్గురు వ్యక్తులు మొబైల్ ఫోన్ లాక్కెళ్లినట్లు గుర్తించారు. అత్తావర్‌కు చెందిన 20 ఏళ్ల శమంత్, హరీష్ పూజారి పోలీసుల అదుపులో ఉండగా రాజేష్ తప్పించుకోగలిగాడు. దీనిపై పాండేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.డిపార్ట్‌మెంట్ ఏఆర్‌ఎస్‌ఐ వరుణ్ అల్వాకు రివార్డు ఇస్తామని మంగళూరు పోలీసు కమిషనర్ ఎన్ శశి చెప్పారు.నిందితుడిని పట్టుకున్న ఏఆర్‌ఎస్‌ఐ వరుణ్‌ అల్వా అండ్‌ టీమ్‌కు రూ.10,000 నగదు రివార్డు పోలీసు కమిషనర్ ప్రకటించారు.Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement